నంద్యాల: ఏ దిక్కూ లేకపోతే అక్క మొగుడే దిక్కూ అన్నదట వెనకటికో జాణ.. అచ్చం అట్లాగే ఉంది నేటి టీడీపీ చిత్త కార్తె రాజకీయం. ఎవరు దొరుకుతారా పచ్చ కండువా వేద్దామా అని కక్కుర్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు... ఏదో టిడిపి కార్యక్రమంలో డ్రమ్స్ వాయించడానికి వచ్చిన కుర్రాడికి పార్టీ కండువా కప్పేసి, ప్రముఖ వైయస్ఆర్ సీపీ నాయకుడు టీడీపీలో చేరిపోయాడు అంటూ చంకలు గుద్దుకున్నారు తెలుగు తమ్ముళ్లు. పోనీ అదేదో బుల్లి స్థాయి టీడీపీ నాయకులు చేసిన కక్కుర్తి పని కాదు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇలాంటి కక్కుర్తి కండువా పనులు చేస్తూ దొరికాడు. టీడీపీలో కార్యకర్తలుగా ఉండటానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే మాత్రం ఇలా డ్రమ్స్ మోగించడానికి వచ్చిన వాళ్ళు, కేటరింగ్ వాళ్ళు, టెంట్ హౌస్ వాళ్ళను దొరక బుచ్చుకొని మెళ్ళో కండువా వేసి వైయస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరారు అంటూ ప్రచారం చేసుకోవడమేనా?? పాపం కండువా వేయ వద్దు అని చెబితే ఇచ్చే పేమెంట్ ఎక్కడ ఆపేస్తారో అని వాళ్ళు గమ్మున ఉంటున్నారులా ఉంది. అయినా ఇవేమి లేకి బుద్ధులు మాజీ టీడీపీ ఎమ్మెల్యే గారూ... మీ బాబు గారు ఎంచక్కా ప్యాకేజీ ఇచ్చి మరీ బానిసలను కొని పెట్టారు కదా.. ఆ జెండా కూలీలను పిలిచి వాడుకోకుండా ఇలా సంబంధం లేని వాళ్ళను తెచ్చి వాపును బలుపుగా నమ్మించడానికి నానా...తిప్పలు పడనేలా..?? అని కిసుక్కున నవ్వుకుంటున్నారు జనాలు.. అసలు విషయం ఏంటంటే.. ఆత్మకూరు పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆర్యవైశ్యులు టిడిపి లో చేరారాన్నది అభూత కల్పన మాత్రమే . కేవలం కొప్పరపు రవిప్రసాద్ , ఆయన కొడుకు , మేనల్లుడు మాత్రమే టిడిపి కండువాలు వేసుకున్నారు . మిగతా వారు ఆర్య వైశ్యులు పేరుతో కండువాలు వేసుకున్న యువకులు కరివేన నుండి డ్రమ్స్ కొట్టేందుకు వచ్చిన కూలీలు. పట్టణం లో భారీ సంఖ్యలో ఆర్యవైశ్యులు టిడిపి లో చేరికలు ఉంటాయని చేసిన ఆర్భాటం చివరికి తుస్సు మంది . దీంతో టిడిపి కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్న మాట నిజం . కనీసం ఓటు హక్కు ఉందో లేదో తెలియని డ్రమ్స్ కొట్టే అమాయక దళిత కూలీలకు కండువాలు వేసి వారే ఆర్య వైశ్యులు అని పేర్కొనడం టిడిపి కే చెల్లింది . కేవలం ఒక కుటుంబానికి చెందిన వారు వారి వ్యక్తిగత కారణాల వల్ల చేరితే పట్టణ ఆర్య వైశ్యులు అంతా టిడిపి లో చేరుతున్నట్లు ఆర్భాట ప్రచారాలు చేసు కోవడం టిడిపి నాయకులకే చెల్లింది.