కూరగాయల భేరం

మనది వ్యవసాయ దేశం. రైతుల్ని కోటీశ్వరుల్ని చేసే ఏకైక దేశం. మేము ఈ రోజు వేల కోట్ల ఆస్తిపరులైనామంటే కారణం మా తాత కూరగాయలమ్మడమే అన్నాడు లోకేష్.
కూరగాయల్లో పుచ్చులొస్తాయని తెలుసు కానీ, కోట్లు వస్తాయని తెలియదే అన్నారు విలేకరులు.
మా ఇంటి పేరే నారా. అందుకే కూరా నారా అమ్ముకొని ఇంతటి వాళ్లమయ్యాం అన్నాడు లోకేష్
కూరగాయల్లో కోట్లు ఎలా వస్తాయో, ఆ రహస్యాన్ని రైతులకి కాస్త చెబితే వాళ్లూ బాగుపడతారు. ఈ దేశమూ బాగుపడుతుంది.
దాందేముంది సింపుల్, వాళ్లని కూడా తలా ఒక హెరిటేజ్ మార్ట్ పెట్టుకోమని చెప్పండి
మింగ మెతుకు లేదు, మీసాలకి సంపెంగనూనె అంటే ఇదే. పొలంలోంచి మార్కెట్ కి తెచ్చి రైతులు అమ్ముకోలేకపోతున్నారు. ఇక సూపర్ మార్కెట్లు ఏం పెట్టుకుంటారు సార్
అందుకే వాళ్లు వెనుకబడి వుండేది.పండించడం గొప్పకాదు, దాన్ని అమ్మడం గొప్ప. దేన్నయినా అమ్మడం, కొనడం మా నాన్నదగ్గర నేర్చుకున్నాను. అందుకే రైతుల దగ్గర కూరగాయలు కొని జనానికి అమ్ముతున్నాను అన్నాడు లోకేష్
అసలు మీకు కూరగాయలు ఎలా పండుతాయో తెలుసా? అడిగారు విలేకరులు
ఎలా పండడమేంటి. భూమిలోంచి పండుతాయి
ప్రపంచంలో ఏదైనా భూమిలోంచి పండాల్సిందే. గాలిలో మీ లాభాలు మాత్రం పండుతాయి. ఇదేంటో చెప్పండి? అని ఒక కూరగాయని చూపించాడో విలేకరి
ఆ మాత్రం తెలియదా? అది క్యారెట్ అన్నాడు లోకేష్
దీన్ని ముల్లంగి అంటారు. క్యారెట్ ఎర్రగా వుంటుంది. ఉల్లిగడ్డకి, ఉర్లగడ్డకి తేడా తెలియకుండా తమరు కూరగాయలు అమ్మేసి కోట్లు కూడబెట్టేసారు
వ్యాపారం చేయడానికి ఏమీ తెలియక్కరలేదు. రాజకీయాల్లో నాకేం తెలుసని పార్టీ పదవిని, ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు
రేపు మంత్రి కూడా అవుతారు కదా
మంత్రేంటి? తప్పు తప్పు. ముఖ్యమంత్రి కూడా నేనే అవుతా. కూరగాయలు భేరం తెలిస్తే చాలు రాజకీయాలు అవే అలవాటు అవుతాయి.
అవును, మీ నాన్న కూరగాయలు  భేరం చేసి అడ్డంగా బ్రీఫ్డ్ మీ అంటూ దొరికిపోయాడు. 
మా నాన్నకి సరిగా తెలియదు. నేనైతే పుచ్చుల్ని కూడా ఏసీలో పెట్టి అమ్మేసేవాన్ని
అది సరే, మీరు ఎమ్మెల్సీగా ఏం చేస్తారు?
ప్రజలకు సేవ చేస్తా
ఏరకం సేవ
నాన్న బిజీగా వున్నాడు కదా, పైగా వయసైపోయి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. నేను రంగంలోకి దిగి డీల్ సెటిల్ చేసి కమిషన్లు
తీసుకుంటా. కాంట్రాక్టులు ఫైనలైజ్ చేస్తా. ఆల్రెడీ బిజినెస్ లో నాకు బోలెడ్ ఎక్స్ పీరియన్స్ ఉంది

Back to Top