బాబు భీతి

నెల పూర్తయ్యేసరికి 2000 పింఛను

డ్వాక్రా మహిళలకు రూ.10,000

ప్రాణభీతి తెలుసు, పాపభీతి తెలుసు కానీ ఈ బాబు భీతి ఏమిటా అని అనుకుంటే అచ్చెంనాయుడు అర్థం అయ్యేలా చెబుతాడు. అక్కడిదాకా ఎందుకంటే ఇదుగో వివరం చెబుతా వినుకోండి. పాపం చేస్తే నరకానికి పోతారనో, నష్టపోతారనో పాపభీతి ఉంటుంది. రోగం వచ్చినప్పుడో, ఎవరైనా చంపుతారన్నప్పుడో  ప్రాణభీతి ఉంటుంది. కానీ ఎన్నికలొస్తున్నాయంటే (అవి సాధారణ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయితీ ఎన్నికలు కావచ్చు లేక ఉప ఎన్నికలు కావచ్చు...) ప్రజల్లో బాబుభీతి మొదలౌతుంది. అంటే బాబుకు ఓటేయపోతే జరిగే పరిణామాలవల్ల కలిగే భయమే బాబు భీతి అన్నమాట...దీన్ని ప్రచారం చేస్తున్నది కూడా పచ్చతమ్ముళ్లే. 
బాబు భీతి బహురకాలు 
బాబు వేసిన రోడ్లమీద నడుస్తున్నారు కనుక ఓటేయాలి. బాబుకు ఓటేయకపోతే మీకొచ్చే పథకాలన్నీ ఆగిపోతాయి. బాబుకు ఓటేస్తేనే మీ ప్రాంతానికి ఇస్తామన్న నిధులు వస్తాయి. బాబుకు ఓటేస్తేనే రోడ్డు వైడ్నింగ్ లో కూలగొట్టిన మీ ఇళ్లు, షాపులకు పరిహారం వస్తుంది. బాబు చేసే పనికి కూలీ ఎందుకు ఇవ్వరు? బాబుకు ఓటేస్తేనే పునాదిరాళ్లు పడ్డవాటికి పనులు మొదలౌతాయి. నెల పూర్తయ్యేసరికి 2000 పింఛను తీస్కోబోతున్నారు, డ్వాక్రా మహిళలు 10,000 పుచ్చుకునేందుకు చెక్కులందుకున్నారు, ఇన్ని పుచ్చుకుని బాబుకు ఓటేయకపోతే కాళ్లూ, చేతులూ పడిపోతాయి. 
మునుముందు మారే పరిణామాలు
బాబుకు ఓటు వేయకూడదు అనుకుంటేచాలు మీ ఓటే గల్లంతైపోతుంది. బాబుకు ఓటు వేయొద్దని ఎవిరితో అయినా అంటే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డే గల్లంతైపోతుంది.  ఒకవేళ బాబుకు ఓటు వేయకపోతే గుండె పోటు వస్తుంది. బాబుకు ఓటేయకపోతే బీపీ పెరుగుతుంది. బాబుకు ఓటేయకపోతే తిరుపతి వెంకన్నకీ, బెజవాడదుర్గమ్మకీ కోపం వస్తుంది. బాబుకు ఓటేయకపోతే సముద్రం పోటెత్తుతుంది. బాబుకు ఓటేయపోతే మళ్లీ సునామీ మంచెత్తుంతుంది. బాబుకు ఓటేయకపోతే హుదూద్, తిత్లీ కలిసి వచ్చి ఠారెత్తిస్తుంది. బాబుకు ఓటేయకపోతే రాష్ట్రం శోకిస్తుంది. దేశం (తెలుగుదేశం) ఉరేసుకుంటుంది. బాబుకు ఓటేయకపోతే ప్రపంచమే బద్దలౌతుంది. గ్రహాలు గతి తప్పుతాయి. నక్షత్రాలు రాలిపడతాయి. భూమికి అదే అంతం. యుగాంతం...
ఈ కథ ఇంతటితో సమాప్తం. 
 

Back to Top