బాబు మాటలకి అర్థాలు వేరు!

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు
తమిళనాడులో వున్న ఐక్యత మనలో లేదని అందరూ అంటున్నారు అన్నాడో విలేకరి
తమిళనాడు వేరు. మనం వేరు అన్నాడు బాబు
వేరు ఎలా అవుతాయి? రెండూ భారతదేశంలోనే కదా వున్నాయి అన్నాడు విలేకరి
నాడు అంటే ప్రాంతం. ప్రదేశ్ అంటే దేశం. ప్రాంతానికి, దేశానికి తేడాలుంటాయి. 
విస్తృతమైన అర్థం కోసం తెలుగుదేశం అని పార్టీ పెట్టుకున్నాం
ఇక్కడ మేము అర్థాలు అడగలేదు. అర్థవంతమైన పాలన అడుగుతున్నాం
నేను అందిస్తున్నది కూడా అర్థవంతమైన పాలనే. అర్థం అంటే డబ్బు. మా పాలన డబ్బుతో ముడిపడి వుంది. డబ్బు లేనిదే మా గవర్నమెంట్ లో ఏ పని జరగదు
తమిళనాడు లాగా మనం కూడా ప్రత్యేకహోదా కోసం ఎందుకు ఉద్యమించడం లేదు
ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి రెండూ ఒకటే కదా
అని ఎవరు చెప్పారు?
ఎవరో ఎందుకు నేనే చెబుతున్నా, నేను చెప్పిందే వేదం
జల్లికట్టు కోసం వాళ్లు కేంద్రం మెడలు వంచితే, మీరు కేంద్రం దగ్గర తలవంచుకొని జీవిస్తున్నారు
కేంద్రాన్ని బతిమిలాడి, కాళ్ల వేళ్ల పడి పనులు సాధించాలి. గొడవపడితే నిధులు రావు
నిధులు కాదు, మీ ఓటుకి నోటు కేసుని బయటకు తీస్తారని చెప్పండి
అవన్నీ ప్రతిపక్ష నేత ఆరోపణలు
మరి అది నిజం కాకపోతే కేంద్రాన్ని నిలదీయండి
నిలదీస్తే కాళ్లు ఇరగ్గొడతారు. అమరావతి కట్టాలని లేదా మీకు
మూడేళ్ల నుంచి పాడిన పాటే పాడుతున్నారు. అక్కడ అమరావతి లేదు, హోమియోపతి లేదు. దేశాలన్ని తిరిగి జనం నెత్తిన ఖర్చులు బాదుతున్నారు
దావోస్ లో అందరూ నన్నే పొగిడారు తెలుసా?
అవును మీ మీడియా రాసింది కదా, మీరు చలికి వణుకుతున్నారు అని కూడా రాసింది
నేను చలికి వణకడం లేదు. ఎలెక్షన్లు దగ్గరికి వచ్చాయని వణుకుతున్నాను
దానికి వణకడమెందుకు? ఈసారి దుప్పటి కప్పుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిందే
అవన్నీ గిట్టని వాళ్ల రైతులు. ఈ రెండున్నరేళ్లు మేము అద్భుతాలు చేసాం
అవును, చేసారు. ఫీజుల రూపంలో తల్లితండ్రుల రక్తం తాగే నారాయణని మంత్రి చేసారు. గుంటూరులో ఎలుకలు పసికందుని పీక్కుతిన్నాయి.
పుష్కరాల్లో జనం తొక్కిసలాడి చచ్చిపోయారు. అన్నిటికన్నా వింత శుంఠ లోకేష్ కి పార్టీ పదవి ఇవ్వడం
పోలవరం తెచ్చాను
వూరుకొండి సార్. ఆలుచూలు లేదు అన్నట్టుంది. అక్కడ ఏమీ ఇంకా మొదలేకాలేదు. అప్పుడే పోలవరంతో అంతా సస్యశ్యామలమైనట్టు
మాట్లాడుతున్నారు
పట్టిసీమ రాలేదా?
అవును సీమలో అందరూ సిరిసంపదలతో తూలతూగుతున్నారు. రైతుల ఆత్మహత్యలు కంటికి కనపడలేదా?
నా కళ్లకి అంతా పచ్చగానే వుంది అంటూ బాబు ముగించాడు
Back to Top