తాడేపల్లి: ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం వైయస్ జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సమగ్ర భూసర్వేపై దృష్టిపెట్టాలని, డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపిపించడం అన్నది చాలా కీలకమన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకంపై సీఎంకు వివరాలందించిన అధికారులు. జాతీయ ఉపాధిహామీ పథకంలో ఈ ఏడాది లక్ష్యం 24 కోట్ల పనిదినాలు. అయితే జులై నాటికి 18.90 కోట్ల పనిదినాలు పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ స్థాయిలో రాష్ట్రం ఉత్తమ పనితీరు కనపరిచిందన్న అధికారులు. మొత్తంగా రూ.9600 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఇందులో వేతనాల కింద చేయనున్న ఖర్చు రూ. 3840 కోట్లు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలపై సీఎం సమీక్ష. గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని తెలిపిన అధికారులు. సెప్టెంబరు నాటికి సుమారుగా అన్నింటినీ పూర్తిచేస్తామన్న అధికారులు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే...: మిగిలిన ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం. వీటికి అవసరమైన స్థలాలను ముందుగా గుర్తించాలన్న సీఎం. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం కింద గ్రామాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్స్ సర్వే పూర్తి అయిందన్న అధికారులు. సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో భూ హక్కుపత్రాలు ఇస్తున్నామన్న అధికారులు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనదన్న సీఎం. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్న సీఎం. అలాగే గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్న సీఎం. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్న సీఎం. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదని, అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టంచేసిన సీఎం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్ద (సెర్ఫ్) పైనా సీఎం సమీక్ష. జులైలో నెలలో ఇచ్చిన పెన్షన్లు 62,99,393. నెలకు పెన్షన్ల రూపేణా విడుదల చేసిన మొత్తం రూ.1735.36 కోట్లు. వైయస్సార్ ఆసరా కింద మూడేళ్లలో ఇప్పటివరకూ అందించిన మొత్తం రూ.19,178.17 కోట్లు. వైయస్సార్ సున్నావడ్డీ కింద రూ. 4,969.05 కోట్లు. వైయస్సార్ చేయూత కింద మూడేళ్లలో రూ. 14,129.11కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలమందికి జీవనోపాధి కల్పన. వైయస్‌ఆర్ చేయూత లబ్ధిదారులకు నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.18,750లు ఇస్తున్నామని, మొత్తం రూ.75వేలు ఇస్తున్నామన్న సీఎం. అర్హత ఉన్న లబ్ధిదారునకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రభుత్వం అందిస్తున్నందున ఈ డబ్బును మహిళల ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడానికి, స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న సీఎం. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి.. ఆ డబ్బును చేయూత డబ్బుతో జోడించి వారిలో స్వయం ఉపాధి పెంపొందించే మార్గాలపై దృష్టిపెట్టాలన్న సీఎం. అధికారుల సమగ్ర పర్యవేక్షణ ద్వారానే ఇది సమర్థవంతంగా అమలవుతుందన్న సీఎం. స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేసిన మహిళా మార్టులు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్న అధికారులు. ఇప్పటివరకూ 36 మహిళామార్టులు ఏర్పాటు చేశామన్న అధికారులు. ఇప్పటివరకూ రూ. 32.44 కోట్లు మహిళా మార్టులు వ్యాపారం చేశాయన్న అధికారులు రోజూ రూ. 20.62లక్షల వ్యాపారం జరుగుతోందన్న అధికారులు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలుకూడా వర్తింపు చేయాలన్న సీఎం. ఈమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ఇదే అంశంపై పలుమార్లు బ్యాంకులపై ఒత్తిడి తీసుకు వచ్చి స్వయంసహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ మేజర్ పార్ట్ 9 శాతం వరకూ తగ్గించగలిగామని , ఇప్పుడు స్త్రీనిధి కింద ఇచ్చే రుణాలపై వడ్డీకూడా 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. మహిళలంతా వాయిస్ లెస్ వర్గానికి చెందినవారని, వారి తరపున అధికారులే గట్టిగా మాట్లాడాలన్న సీఎం.