ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్క‌రించిన వైవీ సుబ్బారెడ్డి 

తిరుమ‌ల‌: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం సింహ వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను  టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి  దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు. డాక్ట‌ర్‌ అన్నదానం చిదంబర శాస్త్రి రచించిన ''సదాచారము -  వైజ్ఞానిక విలువలు '' గ్రంథాన్ని ఆవిష్క‌రించారు. డాక్ట‌ర్‌ సూరపురాజు వసంతకుమారి రచించిన‌ ''సాధ్వీమణుల సందేశాలు'' గ్రంథాన్ని ఆవిష్క‌రించారు.  పురాణాల‌లోని ప్రసిద్ధ 11 మంది సాధ్వీమణులు నేటి తరానికి అందించిన సందేశాలను విశ్లేషణాత్మకంగా సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేలా సులభమైన భాషలో ఈ గ్రంథాన్నిర‌చించారు. డాక్ట‌ర్‌ గాలి గుణ‌శేఖ‌ర్ ర‌చించిన‌ ''తాయుమానవ‌ర్‌'' గ్రంథం తాయుమానవర్‌ తమిళ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవలు అందించారు. టీటీడీ బ్రహ్మమొక్కటే గ్రంథమాల శీర్షిక ద్వారా ఈ శ్రీ తాయుమానవర్‌ అనే గ్రంధాన్ని ప్ర‌చురించింది.  కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు పోక‌ల అశోక్ కుమార్‌, శ్రీ రాములు, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామ‌కృష్ణ‌శాస్త్రి, ఉప సంపాదకులు డాక్ట‌ర్ నరసింహాచార్య  పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top