టీడీపీ కుట్రలను తిరుప‌తి ప్రజలు తిప్పికొట్టారు

వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి
 

 తిరుపతి:   టీడీపీ కుట్రలను తిరుప‌తి ప్ర‌జ‌లు తిప్పికొట్టారని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్‌, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో  వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు ఊహించినదేనన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

కాగా, తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.

తాజా వీడియోలు

Back to Top