దక్షిణాఫ్రికాలో ఘనంగా వైయ‌స్ఆర్ జయంతి వేడుకలు 

వైయ‌స్ఆర్ ఆశయాల ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా కృషి

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు

జోహన్నెస్‌బర్గ్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని  వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్‌రాండ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైయ‌స్ఆర్ ప్రజాసేవా తత్వాన్ని, సంక్షేమ పాలనను స్మరించుకుంటూ పార్టీ నాయకులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్  విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైయ‌స్ఆర్ అమలు చేసిన పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.  మహానేత వైయ‌స్ఆర్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. ప్రవాస భారతీయుల్లో వైయ‌స్ఆర్ సంక్షేమ భావజాలాన్ని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి. వెంకట సుబ్బా రెడ్డి, వాసు సింగారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, శ్రీమతి అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజి రెడ్డి, వెంకట్ రెడ్డి ఏనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ, శ్రీమతి కల్పన జోసెఫ్, శివ మోహన్ రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

 

Back to Top