రేపు రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆందోళనలు 

 ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు 

 తాడేప‌ల్లి: రేపు (21.07.2026, మంగళవారం) ఉదయం 10 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  వరుదు కళ్యాణి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆందోళనకరంగా పెరిగిపోయాయని ఆమె పేర్కొన్నారు. గుంటూరు, బద్వేలు వంటి ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో మచ్చగా నిలిచాయని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, అధికార పార్టీ నాయకులకు లభిస్తున్న అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Back to Top