తాడేపల్లి: కూటమి కుట్రలను వైయస్ఆర్‌సీపీ నేతలు పటాపంచలు చేశారు. రాష్ట్రంలో సోమవారం జరిగిన పలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు సత్తా చాటారు. ఏకగ్రీవంగా ఎన్నికై పలు మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లను సొంతం చేసుకున్నారు. గ్రేటర్ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు ఇవాళ మరో విడత ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్), కదిరి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. చాలా చోట్ల కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైయస్ఆర్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యలమంచిలిలో వైయస్ఆర్‌సీపీ జెండా రెపరెప పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైయస్ఆర్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైయస్ఆర్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు. యలమంచిలిలో వైయస్ఆర్‌సీపీ జెండా రెపరెప పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైయస్ఆర్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైయస్ఆర్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు. త్రిపురాంతకంలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ త్రిపురాంతకం వైస్ ఎంపీపీ ఎన్నికలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ చక్రం తిప్పారు. వైయస్ఆర్ సీపీ మేడపి ఎంపీటీసీ పాటిబండ్ల కృష్ణ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికను దగ్గరుండి యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షించారు. చంద్రబాబు కుట్రలను వైయస్ఆర్‌సీపీ సమర్థంగా తిప్పికొట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక నీ ఆటలు సాగవు చంద్రబాబు అంటూ ఈ ఎన్నిక ద్వారా హెచ్చరించారు. మార్కాపురం వైస్ ఎంపిపి గా వైయస్ఆర్‌సీపీ కి చెందిన కుందురు మల్లారెడ్డి ఎన్నికయ్యారు. కంబదూరు వైయస్ఆర్‌సీపీ వశం కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య నేతృత్వంలో కంబదూరు వైస్ ఎంపీపీ పదవిని వైయస్ఆర్‌సీపీ వశం చేసుకుంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీటీసీ సభ్యుడు వంట రెడ్డి పల్లి యనమల సోమశేఖర్ ను కంబదూరు ఎంపీటీసీలు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు పాల్లూరు ఎంపీటీసీ శ్రీదేవి చాలా రోజుల నుండి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ విషయాన్ని ఆమె భర్త తిమ్మారెడ్డి పార్టీ పెద్దలకు తెలిపారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం వైస్ ఎంపీపీ వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. చెర్లోపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ ను 2వ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల, దేవరాపల్లి మండలాల వైస్ ఎంపీపీ పదవికి వైయస్ఆర్‌సీపీ సభ్యురాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొలిమేర వెంకటలక్ష్మి, పంచాడ సింహాచలం గెలుపొందారు. చోడవరం కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ అల్లాజి వైయస్ఆర్‌సీపీ తరఫున ఎంపికయ్యారు. రామగిరిలో టీడీపీకి షాక్ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైయస్ఆర్‌సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైయస్ఆర్‌సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు.