నంద్యాల: నంద్యాల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సత్తా చాటింది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్లింది. మొత్తం 32 వార్డులకు గాను 23కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. ఈ విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్‌లోనూ వైయస్ఆర్‌సీపీ ఆధిక్యం కొనసాగింది. తొలి రౌండ్ ముగిసే సమయానికి మొత్తం 28 వార్డులకు గాను 18 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. రెండు ప్రాంతాల్లోనూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి వ్యూహం నందికొట్కూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుండి నడిపించారు. కేడర్‌తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సాగించిన ప్రచార వ్యూహం ఈ ఫలితాల్లో కీలకంగా నిలిచిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నందికొట్కూరు, బేతంచర్లలో వెలువడిన ఫలితాలు వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.