ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుదాం 

వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్‌రెడ్డి

తిరుపతి: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు చురుగ్గా పని చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్‌రెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు, దాడులపై పార్టీ  అనుబంధ విభాగాల నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిరసనలు చేపట్టాలన్నారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఉద్యమాల్లో ముందుంటార‌ని తెలిపారు. కూటమి అరాచకాలను, దాడులను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని, వాటిని ఆయా వర్గాల నాయకులు ఖండించాలన్నారు.  స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నగర ప్రచార అధ్యక్షుడు ఎన్వీ రమణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర మురళి, పీర్ సాహెబ్ , అయ్యన్న, ముని, హరి, జయశంకర్, దశరథ్, శ్యామ్, లోకేష్, మోహన్, రంజిత్, భరథ్, రుద్ర కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

Back to Top