ఆయూష్‌ ఉద్యోగులకు వైయస్‌ఆర్‌సీపీ నేతల సంఘీభావం

విజయవాడ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆయూష్‌ ఉద్యోగులు రిలే దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. గురువారం దీక్షా శిబిరాన్ని వైయస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు సందర్శించి, ఉద్యోగులకు మద్దతు తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని విష్ణు హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేడన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వ తీరుతో విసుగుచెందారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.
 

Back to Top