నెల్లూరు: జడ్పీ చైర్మన్‌గా విశేష సేవలందించిన ఆనం అరుణమ్మను గౌరవించాల్సిన చివరి జనరల్ బాడీ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం దారుణమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. జిల్లా ప్రజల కోసం సేవలందించిన మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించడంలో జిల్లా ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పేర్కొన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కూటమి నేతలు.. మహిళా ప్రజాప్రతినిధికి కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని కాకాణి పూజిత ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాప్రతినిధులు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. సేవలందించిన ఆనం అరుణమ్మను గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించడం ద్వారా మహిళల పట్ల కూటమి నేతల వైఖరి బయటపడిందన్నారు.