తాడేపల్లి: విమాన ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల భద్రత పట్ల తన బాధ్యతను చివరి వరకు నిలబెట్టుకున్న ఆయన ధైర్యం, నిస్వార్థ సేవకు సెల్యూట్ చేశారు. కెప్టెన్ స్మిత్ మచ్చార్ భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్న వైఎస్ జగన్.. ఆయన చూపించిన ధైర్యం, త్యాగస్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఆయన త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిజమైన హీరోగా కెప్టెన్ స్మిత్ మచ్చార్ నిలిచారని కొనియాడారు.