తిరుపతి జిల్లా: ఎర్రావారిపాళెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, కేడర్‌కు గుర్తింపు కార్డులను చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, స్థానిక నాయకులు పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని, ఎర్రావారిపాళెం మండలంలోని 12 పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలకు పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క వార్డును కూడా ఏకగ్రీవంగా వదులుకోకుండా ప్రతి స్థానంలో బలంగా పోటీ చేయాలని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సూచించారు. కార్యకర్తలకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి వార్డును ముఖ్యంగా భావించి విజయాన్ని చారిత్రాత్మకంగా మలచాలని, చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, అవసరమైన ఎన్‌ఓసీల కోసం అధికారులు, పోలీసుల వద్ద ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు మమేకమై పనిచేసినప్పుడే విజయాన్ని సాధించగలమని, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపి గొప్ప నాయకులుగా ఎదగాలని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు.