ఏబీఎన్‌ అంటే ‘ఆల్‌ బూతుల నెట్‌వర్క్‌’

ఏబీఎన్‌ రాధాకృష్ణది మీడియా హౌజ్‌ కాదు

అది ––– డ్యాష్‌ డ్యాష్‌ డ్యాష్‌ హౌజ్‌

కారుమూరు వెంకట్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి.

మావిగన్‌ కారిడార్‌కు ప్రజల మద్దతు పెరుగుతోంది 

తక్కువ ఖర్చుతో రాజధాని సాధ్యమని వైయ‌స్ జగన్‌గారి ప్రతిపాదన

జగన్‌గారి ప్లాన్‌–బీ ప్రతిపాదనకు ప్రశంసలు 

మావిగన్‌ రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌ అని ఆర్థికవేత్తల అభిప్రాయం 

కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టీకరణ

మావిగన్‌పై చర్చ జరుగకుండా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం 

ఏబీఎన్‌ రాధాకృష్ణ కామెంట్స్‌లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు 

అవి ఏ మాత్రం క్షమించరానివి. రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి

లేకపోతే రాధాకృష్ణ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి వార్నింగ్‌

తాడేపల్లి: మావిగన్‌ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు ఉద్దేశపూర్వకంగా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ నడుపుతున్నది మీడియా హౌజ్‌ కాదని.. అది ఒక ––– డ్యాష్‌ డ్యాష్‌ డ్యాష్‌ హౌజ్‌ అని ఆయన ఫైర్‌ అయ్యారు. మీడియా పేరుతో చంద్రబాబుకు బ్రోకరిజమ్‌ చేస్తున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యక్తిగత దూషణలకు దిగారని ఆక్షేపించారు. ఇకనైనా రాధాకృష్ణ వైఖరి మార్చుకోకపోతే, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

జగన్‌గారి మావిగన్‌ ప్రతిపాదనకు సర్వత్రా హర్షం:
    మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్‌) 110 కి.మీల కారిడార్‌ను రాజ­ధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్‌గారు చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలిక వసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గం కూడా అభిప్రాయపడుతోంది. ఎలాంటి మౌలిక వసతులు లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు చేస్తే తప్ప, రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించలేం. అలా అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అందులో కేవలం 10 శాతం అంటే.. రూ.20 వేల కోట్లతో మావిగన్‌ ప్రాంతం.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందుతుంది. అందుకే జగన్‌గారి మావిగన్‌ ప్రతిపాదనను అందరూ సమర్థిస్తున్నారు.

అవినీతి కోట కుప్పకూలుతుందని చంద్రబాబుకు భయం:
    మావిగన్‌ ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్తే అమరావతి నిర్మాణంలో తన అవినీతి కోట కుప్పకూలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుంది. అందుకే మావిగన్‌ ప్రతిపాదనను ప్రజల్లోకి వెళ్లకుండా అనుకూల ఎల్లో మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌తో చర్చ మొదలుపెట్టారు. మావిగన్‌ ప్రతిపాదనలను తిప్పికొట్టడానికి కొంత మంది కరివేపాకు బ్యాచ్‌ను రంగంలోకి దించి జగన్‌ గారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారు. 

అది మీడియా హౌజ్‌ కాదు. ––– హౌజ్‌:
    నిన్న (ఆదివారం) ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో రాధాకృష్ణ చెత్త పలుకులు పలికారు. నిజంగా మనిషి పుట్టుక పుట్టిన వాడు ఎవరైనా,  కడుపుకు అన్నం తినే వాడు ఎవరైనా భార్యలు, మహిళల గురించి ఇలాంటి నీచమైన రాతలు రాస్తారా? ఈ ప్రపంచంలో మీడియా నడిపే వారు ఎవరైనా ఇలా రాశారా?. 
    అసలు రాధాకృష్ణ మీడియా హౌజ్‌ నడుపుతున్నారని అనుకోవడం లేదు. ఆ పేరు ఏంటో మీరే చూసుకోండి. ––– అది డ్యాష్‌ డ్యాష్‌ డ్యాష్‌ హౌజ్‌. దాన్ని రాధాకృష్ణ నడుపుతున్నారు కాబట్టే, ఇలాంటివి రాస్తారు. 

నీ బతుకు ఎవరికి తెలియదు?:
    ఏబీఎన్‌ రాధాకృష్ణ నీ బతుకు ఎవరికి తెలియదు. ఒక డాక్టర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. సైకిల్‌ మీద తిరుగుతూ పేపర్లు అమ్ముకున్న నీవు, ఆ తర్వాత ఏకంగా ఒక పత్రికకే యజమానివి అయ్యావు. మరి ఏ బ్రోకర్‌ పనులు చేసి అలా ఎదిగావు. అందుకే నిన్ను అందరూ జర్నలిస్ట్‌ కాదు. ఆ పేరుతో నీవు చేస్తోంది బ్రోకరిజమ్‌ అని అంటారు. అలాంటి నీచ చరిత్ర ఉన్న నీవు ఇవాళ మహిళల గురించి, వైయస్‌ఆర్‌సీపీ గురించి మాట్లాడుతావా? నీ కూతురునే నీ రాతలు సరైనవేనా అని అడుగు..ఆమె కచ్చితంగా అసహ్యించుకుంటుంది.

ఎవరికి తలకాయలో గుజ్జు లేదు?:
    డబ్బుల కోసం ఏ పని అయినా సులభంగా చేసే ఈ బజారు ఏబీఎన్‌ రాధాకృష్ణను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎవరికి తలకాయలో గుజ్జు లేదు. తలకాయలో గుజ్జు ఉన్న ఎవడైనా విజయవాడ నగరం, మచిలీపట్నం పోర్టు నగరాన్ని, గుంటూరు నగరాన్ని వదిలేసి 29 గ్రామాల్లో మూడు పంటలు పండే భూముల్లో లక్షల కోట్లు అప్పులు తెచ్చి నగరాన్ని నిర్మిస్తాడా? దానికి నీలాంటి బ్రోకర్లంతా సపోర్టు చేస్తారా?.
    నిజంగా మీడియా హౌస్‌ నడిపే వారు ఇలాంటి రాతలు రాయరు. మీరు ––– డ్యాష్‌ డ్యాష్‌ హౌజ్‌ నడుపుతున్నారు కాబట్టే ఇలా రాస్తున్నారు. చంద్రబాబుకు బ్రోకరిజమ్‌ చేస్తూ, ఏ స్థాయికైనా దిగజారిపోయే ఏబీఎన్‌ రాధాకృష్ణా.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. వైఖరి మార్చుకో. పిచ్చి పిచ్చి రాతలు మాను. నీ దిక్కుమాలిన కామెంట్స్‌పై వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పు. లేదంటే తమ పార్టీ మహిళలే ఏబీఎన్‌ రాధాకృష్ణకు తగిన బుద్ధి చెబుతారని కారుమూరు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top