షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై కాంగ్రెస్ కు సంబంధించి అనుమానాలున్నాయి 

షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉంది

జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు నేతృత్వంలోనే జరగనుంది

ఏదో రకంగా వైయస్ జగన్ ని దించాలనేదే చంద్రబాబు కుట్ర

కడప ఉపఎన్నికల సమయంలోనే టీడీపీ ,కాంగ్రెస్ తో కలసి ఇలాంటి కుట్రలు చేసింది

టిడిపి,కాంగ్రెస్ కలసి గతంలో జగన్ పై తప్పుడు కేసులు పెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ లో  కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది.

అంగన్ వాడిలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి.

గర్భీణులకు,పిల్లలకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఎస్మా ప్రయోగించాం.

అంబటి రాయుడు ఏ కారణంతో రాజీనామా చేశారో తెలియదు.

మీడియా ప్రతినిధులతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి:  షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైయస్సార్ టిపి విలీనంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.వెలగపూడిలోని సచివాలయంలో శనివారం తనను కలసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఏదో రకంగా వైయస్ జగన్ ను దించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎప్పుడూ కాంటాక్ట్ లోనే ఉంటున్నాడని తెలిపారు.తాజాగా షర్మిల కాంగ్రెస్ లో చేరికతో మరోసారి చంద్రబాబు క్యారెక్టర్ బయటపడిందని అన్నారు.

సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..
 

కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 
      కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఎన్నికలలో ఏపిలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీకి సంబంధించినంతవరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. అసలు ఆ పార్టీ లేదు. షర్మిలమ్మగారు ఏరోజైతే తెలంగాణాలో పార్టీ పెట్టారో ఆరోజే ఆమె ప్రస్ధానం ఒక దిశలో మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి ఆమె రావాలనుకున్నారు. దానివెనుక ఎవరున్నారో ప్రజలకు, దేశానికి, అందరికి తెలుసు. చంద్రబాబుఅనే వ్యక్తి ఓ వైపు కాంగ్రెస్ ను మరోవైపు బిజేపిని తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కల్యాణ్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెబుతుంటాను. అర్కెస్ట్రా ఏ నుండి జడ్ వరకు రకరకాల పార్టీలను,వ్యక్తులను  అందర్ని మేనేజ్ చేయడం ఆయనకు అలవాటు. జగన్ గారు టార్గెట్ గా ఆయనను అర్జెంట్ గా దించాలి. జగన్ గారిని వేరేరకంగా ఎదుర్కోలేరు కాబట్టి ప్రజలలోకి వచ్చిగాని,ప్రజల సమస్యల గురించి యాక్ట్ చేసి గాని తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. అందుకే కొత్తకొత్తవన్నీ తీసుకువచ్చి ఏదో సంచలనం కోసం ప్రయత్నిస్తున్నారు. మీడియా సహకారంతో కుట్ర చేశాడు. దానిలో భాగంగా షర్మిల చేరిక కూడా అదే రకంగా జరిగిందని మేం భావిస్తున్నాం.

       ఎందుకంటే ముందుగా జరిగినవన్నీ కూడా ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. సిఎం రమేష్ ఫ్లైట్ లో షర్మిల వెళ్ళడం,బ్రదర్ అనిల్ తో బిటెక్ రవి చర్చించడం ఇవన్నీ యాధృచ్చికం అని మేం భావించడం లేదు. బ్రదర్ అనిల్ ను టిడిపి వాళ్లు ఎంతగా దుమ్మెత్తి పోసేవారు మీ అందరికి తెలుసు. క్రిష్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని. బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయనపై విమర్శలు చేసేవారు. బ్రదర్ అనిల్ వస్తే మర్యాదపూర్వకంగా వెళ్లి ఎయిర్ పోర్టులో కలిశారని చెబుతారు. అక్కడ బిటెక్ రవి మర్యాదపూర్వకంగా ఎలా కలుస్తారో నాకైతే అర్ధం కావడం లేదు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం ఇవన్నీ కూడా అందరికి తెలిసినవే. ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి కాబట్టి మా అంతట మేం వీటిపై మాట్లాడటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి గాని,లేదా మరో పార్టీలోకి చేరడం అనేది షర్మిల ఇష్టం. ఆమె ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు.అయితే ఒకసారి ఇక్కడకు వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే ఉంటారు. ఆమె ఇక్కడకు వస్తారని ఇంతవరకు ఎనౌన్స్ చేయలేదు. ఏపి నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు.  ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే ఏపికి వస్తారు. ఇలాంటిది గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్స్ అప్పుడే వివేకానందరెడ్డిగారిని కాంగ్రెస్,తెలుగుదేశం కలిసే అన్నీ చేశారు. కడపలో జగన్ గారిని,మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు. వారి వల్ల కాలేదు. వైయస్ రాజశేఖరరెడ్డి గారికి ఆయన స్వయానా తమ్ముడు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీనుంచి ఆయన ఉన్నారు. తర్వాత మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజే ఏమీ కాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉంది. మా పార్టీ అప్పుడే పుట్టి ఫ్యాన్ గుర్తు తెచ్చుకుని ఎన్నికలలోకి వెళ్లాం. ఫలితాలు అందరూ చూశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మాట్లాడాలంటే ఏమీ మాట్లాడగలం. ఇందులో చూసినట్లయితే చంద్రబాబు కుట్ర కోణం కనిపిస్తోంది. ఆరోజు నుంచి వైయస్సార్ మృతి పట్ల కాంగ్రెస్ సంబంధాలపై అనుమానాలు ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్ గారిపై టిడిపి,కాంగ్రెస్ పెట్టిన తప్పుడు కేసులు వారు కలిసే చేశారు. అప్పటినుంచి చంద్రబాబు తెరవెనుకో...మరో రకంగానో కాంగ్రెస్ తో కాంటాక్ట్ లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా జీవం పోసి జగన్ గారిపై దుమ్ముత్తి పోయించడం ఎలా...దింపుడు కళ్లెం ఆశతో ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించే ప్రయత్నాలలో తాజాగా కాంగ్రెస్ లో షర్మిల చేరడం. జరగబోయే డ్రామా కూడా అదే. చంద్రబాబుకు కావాల్సింది ఏంటంటే తన హయాంలో ఏం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగకూడదు ఆ అజెండాతో ప్రజలలోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్ గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశారు. చెప్పనవి కూడా చేశారు. తనను ప్రూవ్ చేసుకున్నారు.ఇది అందరికి తెలిసిన విషయమే అని అన్నారు. 

అంగన్ వాడి సమ్మె పట్ల ప్రభుత్వం చాలా సంయమనంతో ఉంది.గర్బిణులు,పిల్లలు ఇబ్బందుల దృష్య్యా సమ్మె విరమించమని విజ్ఞప్తి చేస్తున్నాం.
అత్యవసర సర్వీసులు కాబట్టే ఎస్మా ప్రయోగం. 
     ఎస్మా అనేది ఎందుకు పెట్టారంటే అత్యవసరసర్వీసుల ఇంపార్టెన్స్ చెప్పడానికి రూపొందించింది. అంగన్ వాడీ సర్వీసులు  అత్యవసరసర్వీసులు కాదా...ఇప్పుడు మంత్ మొదలైంది. గర్భీణులకు,చిన్నపిల్లలకు మంత్ ప్రారంభమైంది. వారికి రేషన్,పౌష్టికాహారం సరఫరా చేయాలి. అంగన్ వాడి సమ్మె ప్రారంభమై ఎన్ని రోజులైంది. ఎన్ని రోజులు నడవనివ్వాలి. 2014-19 మధ్య చంద్రబాబే అధికారంలో ఉన్నారు కదా. రైతులు కరెంట్ ఛార్జీలపై ఉద్యమిస్తే లోకేష్ తండ్రి చంద్రబాబు మాదిరిగా గుర్రాలతో రైతులను తొక్కించలేదుకదా. సమ్మె చేస్తూనే ఉన్నారు గా. తిరిగి నెల వచ్చింది. సర్వీసులు మొదలు పెట్టాలి. అత్యవసరసర్వీసులు కాబట్టి ఆ ప్రొవిజన్ ఉంది. లేదా వదలేయమంటారా... అి ప్రశ్నించారు.

      సమ్మె కారణంగా వీళ్ళు రోడ్లపై ఉంటారు.పిల్లలు,గర్బిణులు ఆకలితో అలమంటించాల్సి వస్తుంది. గర్భిణులు,బాలింతలు,పిల్లలు అవస్ధలపాలు కావాలని చంద్రబాబు ఆయన కొడుకు కోరుకుంటున్నారా...లోకేష్ మాట్లాడిందానికి ఏమైనా అర్ధం ముందా...నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా...మళ్ళీ చెబుతున్నాను...వాళ్ళ తాత ఎన్టీఆర్ ను చంపింది ఎవరు...చంద్రబాబు కాదా...దానికి సమాధానం లోకేష్ చెబితే బాగుంటుంది. పొద్దుపోని మాటలు మాట్లాడటం కాదు. ప్రాస కుదిరిందనో...నినాదం లాగా ఉంటుందనో...దబాయించవచ్చనో...ట్వీట్టర్ ఉంది కదా అని ఏదో ఒక తిట్టడం...జరుగుతుంది. అసలు మీరు(మీడియా) ప్రశ్నించాలి. మీరు లోకేష్ ను ఎస్మాగురించి అడగండి అవి ఎమర్జెన్సీ సర్వీసెసా కాదా అని ప్రశ్నించండి. ఆయన స్టాన్ ఫోర్డ్ లో చదివాడు కదా. సమ్మె ప్రారంభమై చాలారోజులు అయింది కదా. అలా వదిలేస్తే తిరిగి లోకేషే అంటాడు బాలింతలను పట్టించుకోని ప్రభుత్వం అని అంటాడు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా వ్యవహరించారు. జగన్ గారు ఎలా వ్యవహరిస్తున్నారు అని చూస్తే తేడా తెలుస్తుంది. జగన్ గారు ఎంత సంయమనంతో ఉన్నారు. ఎంత ఓపిగ్గా మాట్లాడుతున్నారు. దండం పెట్టి వారిని అడుగుతున్నాం. మీ డిమాండ్లన్నీ దాదాపు తీర్చాం. 11 డిమాండ్ల వస్తే దాదాపు పది వరకు తీర్చడం జరిగింది. ఒకటి రెండు అంశాలలో ఆర్దికపరమైనది. అది కూడా గతంలో ఇచ్చిన హామీని ఎప్పుడో పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే అమలు చేశాం. తెలంగాణాతో ఈక్వల్ గా.... ఆ తర్వాత తెలంగాణాలో రెండేళ్ళకో...మూడేళ్లకో పెంచింది. ఇప్పుడు వచ్చిన దాంతో ఈక్వల్ అంటున్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామనే చెప్పాం. లేదు వాళ్ళు ఇప్పుడే కావాలని అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు మేయలేం. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్ గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా.. తూపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్నవాడు లోకేష్. అలాంటి లోకేష్ మా గురించి జగన్ గారి గురించి విమర్శలు చేయడం విడ్డూరం.

అంబటి రాయుడి విషయంలో రీజన్స్ తెలిశాక స్పందిస్తాం. 
అంబటి రాయుడు  కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్ తో వచ్చారో...దేనికి రాజీనామా చేశారనేది కూడా తెలియదు. ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. అసలు ఆయన ఏమన్నారనేది చూసినట్లయితే కొద్దికాలంపాటు దూరంగా ఉంటానని తెలిపారు. రీజన్స్ తెలియాలి. తెలిశాక స్పందించవచ్చు.

Back to Top