చంద్రబాబు వికృత విన్యాసంలో నరబలి  

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది బలయ్యారు

అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్నారు

తన రోడ్‌షోకు బాగా జనం వచ్చినట్టు కనబడాలన్నదే బాబు ప్లాన్‌

ప్లాన్‌ ప్రకారమే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారు. 

కందుకూరు ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలి

చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపం కనిపించడం లేదు

దుర్ఘటనను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం  సిగ్గుచేటు

ఏది జరిగినా సెన్సెషన్‌ చేసుకోవాలన్నదే చంద్రబాబు ఆరాటం

చంద్రబాబుకు జనం ప్రాణాలంటే లెక్కలేదు

తాడేపల్లి: చంద్రబాబు  వికృత విన్యాసంలో ఈ నరబలి  జరిగిందని భావిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదని, సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా చంద్రబాబు లేరన్నారు. చంద్రబాబులో లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తుందని మండిపడ్డారు. కందుకూరు సభలో తొక్కిసలాటకు చంద్రబాబే పూర్తిగా బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • నిన్న కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన మీటింగ్‌లో ఘోరం జరిగింది..ఇది అందరికి తెలిసిందే. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరోసారి 8 అమాయక ప్రాణాలు బలి అయ్యాయి. మరో కొంత మందికి సీరియస్‌గా ఉందట..వారందరూ చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలని ప్రార్థిస్తూ..ఈ 8 మంది అమాయకులది యాక్సిడెంటల్‌ మరణం కాదు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం వికృత విన్యాసంలో నరబలి జరిగిందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు  ఒక హిస్టరీ ఉంది. గతంలో 1995లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఏరకంగా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసు. తాను అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చికి 29 మంది అమాయకులను బలి తీసుకున్నారు. మరోసారి ఈయన మితిమీరిన టెక్నాలజీతో పబ్లిసిటీ పిచి మరి ఎక్కువైంది. డ్రోన్లతో షాట్స్‌ తీసుకుంటే మంచి క్రౌడ్‌ వచ్చినట్లు కనబడాలి అనే కక్కుర్తితో మీటింగ్‌లో జనాలు బాగా కనిపించాలని సందువైపు తోచుకుంటూ వెళ్లి ..పెద్ద రోడ్డును క్లోజ్‌ చేశారు. ఇది కోల్డ్‌ బ్లెడెడ్‌ ప్లాన్డ్‌ పబ్లిసిటీ కోసం చేసిన యాక్సిడెంట్‌. నిజంగా వైడ్‌ రోడ్డులో జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా చిన్న సందులనే ఎంచుకుంటున్నారు.
  • ఎవరైనా పెద్ద మీటింగ్‌ జరపాలనుకుంటే గ్రౌండ్‌కు వెళ్తారు. లేదంటే పెద్ద రోడ్డును ఎంచుకుంటారు. దానికి పూర్తి భిన్నంగా విడ్త్‌ తగ్గించి ఇరుకు రోడ్డును ఎంచుకున్నారు. దానిపై ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంట్లోకి జనాలను తీసుకెళ్లి భారీగా వచ్చినట్లు చూపించాలని ప్రయత్నం చేశారు.
  • అసలు జరిగింది ఏందని టీవీలు ఇప్పటికే చూపించారు. ఎక్కువ మందిని చూపించాలనే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి. ఇంత జరిగాక కనీసం కొంత పశ్చాత్తాపం ఉండాలి. ప్రయశ్చితం చేసుకునే ప్రయత్నం ఉండాలి. అది ఎక్కడా కూడా చంద్రబాబు మోహంలో కనిపించలేదు. శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి ఆవేశంతో ప్రజలు వచ్చారని అన్నారు. ఇది ఒక ఉద్యమం అన్నారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఇదేం ఖర్మ అని వచ్చారని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ తనదే తప్పు అనే మాట అనడం లేదు. ఈ ఉద్యమంలో వీరు ఆవిరి, సమిధలు అంటున్నారు. ఒక యజ్ఞం జరుగుతుందట..వీరు త్యాగం చేశారట. ఈ త్యాగం వృథా పోదంటా. అర్జెంట్‌గా చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టేందుకు వీరు వచ్చారట. కానీ  జరిగిన అన్యాయమైన, ఘోరమైన దుర్ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయడం సరికాదు. సభకు రకరకాల ప్రజలు వచ్చారు. కార్యకర్తలు కానీ, డబ్బులు ఇస్తారని వచ్చి ఉండవచ్చు. వచ్చిన వారు పద్ధతి ప్రకారం ఇంటికి వెళ్లాలనుకుంటారా? లేదా నువ్వు చేసే స్వార్థపూరిత యజ్ఞంలో సమిధలు అవ్వాలని నీ మీటింగ్‌కు వచ్చారా?. అలాంటి వాళ్లను పట్టుకుని వారి జన్మ ధన్యమైందన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 
  • ఇంతకంటే నీచమైంది ఏదైనా ఉంటుందా? సిగ్గుమాలిన తనం ఉంటుందా? దివాళకోరుతనం ఉంటుందా?. అన్యాయం ఇది.
  • ఆరోజు ఎన్టీఆర్‌ విషయంలో కూడా ఇంతే. ఎన్టీఆర్‌ మరణాంతరం శవాన్ని లాక్కుంటారు. శవానికి దండేస్తారు. మళ్లీ విగ్రహం పెడతారు. నివాళులర్పిస్తారు. ఇవే ఆ పత్రికల్లో పెద్దగా వస్తాయి. చంద్రబాబు నివాళులకు పాత్రుడైన ఎన్టీఆర్‌ జన్మ ధన్యమైనట్లు చూపిస్తారు.
  • గోదావరి పుష్కరాల్లో  తప్పించుకోలేక దాన్ని యాక్సిడెంట్‌ కిందకు తోసేశారు. చంద్రబాబు నేరుగా అక్కడికి వెళ్లి షూటింగ్‌లు తీయించుకుని తొక్కిసలాటకు కారకుడయ్యారు. నిబంధనలు బేఖాతరు చేసి తొక్కిసలాటకు, 29 మంది అమాయకుల మరణానికి కారకుడయ్యారు. పైగా యాక్సిడెంట్లు ఎక్కడ జరగడం లేదని అహంకారంతో ఆ రోజు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ రోజేమో వీరు ఉద్యమంలో సమిధలు అంటాడు. మేం ఆదుకుంటామని అంటున్నాడు. ఈ పోరాటం ఆగదని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు.
  • ఈ మొత్తంలో నటన, కృత్రిమత్వం, ప్రజలతో సంబంధం లేనితనం, ప్రజల గురించి పట్టించుకోకపోవడం, లెక్కలేనితనం తప్ప వేరేవి కనిపించడం లేదు. ఏదైనా దీని నుంచి నేర్చుకుంటారనుకోవడం టూమచ్‌ అవుతుంది. పైగా దబాయించి స్టేట్‌మెంట్లు ఇవ్వడం సిగ్గుచేటు. పోలీసులు అక్కడ లేరని చెప్పడం, నీ అంతకు నీవే తోచుకుని వెళ్లావు. తొక్కిసలాటే జరిగింది. చంద్రబాబు వాహనం అక్కడికి తీసుకెళ్లడం, ఒకరిపై ఒకరు పడటంతోనే ఈ మరణాలు జరిగాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, పోలీసులను తక్కువగా పెట్టారని ఆరోపణలు చేస్తున్నాడు. పోలీసులు చెప్పిన చోట చంద్రబాబు మీటింగ్‌ పెట్టాడా? ఎంత మంది పోలీసులు ఉంటే మాత్రం ఏం చేయగలరు. నీవే రెచ్చగొట్టి ప్రణాళిక ప్రకారం చేసే నేచర్‌ చంద్రబాబుది. ఈయన సడ్డకుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసుకున్న పుస్తకంలో ఉద్యమం అంటే బస్సులు తగులబెట్టాలని చంద్రబాబు అన్నట్లుగా చూశాం. ఏది జరిగినా సెన్సెషనల్‌ కావాలి. దాన్ని కూడా త్యాగం కింద చూపాలనే ఆలోచన చంద్రబాబుది. దీనిపై రివ్యూSజరగాలి. ఏదనుకుంటే అది విచ్చలవిడి తనంతో చేస్తే సరిపోదు. చంద్రబాబు ఏమి అనుకుంటే అది జరగాలి. జరగకపోతే తనను తొక్కేయాలని చూస్తున్నారని ఆగితం చేసి మళ్లీ లైన్‌లోకి రావాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు ఏ రోజు ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. పరిష్కరించలేదు. మళ్లీ ప్రజలు తనను నెత్తిన పెట్టుకుంటారనే ఆశతోనే పబ్లిసిటీ పచ్చి పరాకాష్టకు చేరింది. ఇలాంటి నాయకుడు, పార్టీ అధ్యక్షుడు సభ్య సమాజంలో అందరితో కలిసి సంస్కారవంతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగా చంద్రబాబు లేదు. నిన్నటి ఘటనలో చంద్రబాబు బిహేవియర్‌తో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 
  •  

తాజా వీడియోలు

Back to Top