వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్ఆర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. మూడు రోజులపాటు పర్యటన నిమిత్తం ఉదయం కడప ఎయిర్ పోర్ట్ నుంచి పులివెందుల మార్గమధ్యంలో కమలాపురం నియోజకవర్గం వల్లూరులో వైయస్ జగన్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంద్రారెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెండ్లిమర్రి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మాచనూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. దారిపోడవునా ప్రతి గ్రామంలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. మధ్యా హ్నం పార్టీ నేతలను కలుసుకున్నారు. నూతన వధూవరులకు ఆశీర్వాదం గొందిపల్లె గ్రామంలో ఇటీవల కడప మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాచవరం చంద్రహాసరెడ్డి కుమార్తె వివాహం జరిగిన నేపథ్యంలో వారి స్వగృహానికి వైయస్ జగన్ వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు.