భారీ వర్షాల కారణంగా ప్రమాద ఘటనలపై వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం

ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు మరణించిన ఘటనలపై వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉదృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్‌ సహా ఇద్దరు విద్యార్ధులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండ చరియలు విరిగిపడి వృద్దురాలు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగాసహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో భారీవర్షాల బాధితులకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని వై.యస్‌. జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Back to Top