వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త ఇంటూరి అరెస్టు

గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో విద్యార్థినుల తరుఫున ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మా?

ప్ర‌భుత్వ తీరుపై సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌ల ఆగ్ర‌హం

అమ‌రావ‌తి:  గుడ్లవల్లేరులో హిడెన్‌ కెమెరాల అంశంపై టీడీపీ కూట‌మి ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. మీడియా ప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ  సోషల్‌మీడియా కార్యకర్తలపై అణచివేతకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. గుడ్లవల్లేరులో మీడియా ప్రతినిధులపై  టీడీపీ శ్రేణులు, కాలేజీ యాజమాన్యం మనుషుల దాడికి పాల్ప‌డ‌గా, మరోవైపు వైయస్ఆర్ సీపీ  సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ అరెస్టును అక్ర‌మంగా అరెస్టు చేశారు. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో విద్యార్థినుల తరుఫున సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్ ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ తీరును సోష‌ల్ మీడియా వేదిక‌గా సోష‌ల్ మీడ‌యా యాక్టివిస్ట్‌లు ఎండ‌గ‌డుతున్నారు.  

కాలేజీ యాజ‌మాన్యం దాష్టీకం
వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల వాష్‌ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకానికి దిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడింది. మీడియా సిబ్బందిపైనా కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడికి దిగింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేసింది.

వాష్‌ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

సీక్రెట్‌ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్‌ న్యూస్‌ అవుతుందని విద్యార్థులను వార్డెన్‌ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్‌ న్యూస్‌ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణం జరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌నలో  విద్యార్థినుల ప‌క్షాన ప్ర‌శ్నించిన సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త ఇంటూరి ర‌వికిర‌ణ్‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంటూరి అరెస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఇంటూరి కుటుంబీకులు.. హైకోర్టులో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. పోలీసులపై చర్యలకు కోరుతామని వెల్లడించారు.

అరెస్టుకు ఆస్కారం లేని ఆరోపణల్లో పోలీసులు అరెస్టులకు దిగారు. వేధించాలన్న ఉద్దేశంతోనే గుడివాడ నుంచి పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం పంపించింది. పోలీసులు ఆరోపిస్తున్న పోస్టింగ్స్‌ కూడా ఎన్నికలకు ముందు పెట్టినవే.

 

Back to Top