సమాజానికి ప‌నికిరాని వ్య‌క్తులు చంద్ర‌బాబు, లోకేష్‌

ప్రజా ప్రభుత్వాన్ని తిట్టిస్తూ బాబు శునకానందం పొందుతున్నాడు

ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుది

పనికిమాలిన వ్యక్తులతో ప్రెస్‌మీట్లు పెట్టించి మమ్మల్ని తిట్టిస్తే టీడీపీకే లాస్‌

ఆనం వెంకటరమణను చూస్తే పిల్లలకు తల్లులు చెప్పే బూచోడి సామెత గుర్తొస్తుంది

లోకేష్‌పై విసిరేందుకు ఎవరూ గుడ్డు వేస్ట్‌ చేసుకోరు

నారా లోకేష్‌.. సభ్యత, సంస్కారం నేర్చుకొని మాట్లాడు 

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి హెచ్చరిక 

తాడేపల్లి: పనికిమాలిన వ్యక్తులతో ప్రెస్‌మీట్లు పెట్టించి వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని తిట్టిస్తే టీడీపీకి రోజుకో 10 వేల ఓట్లు తగ్గడం తప్ప మరే ఉపయోగం ఉండదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. దిక్కుమాలిన వ్యక్తులతో ప్రభుత్వాన్ని తిట్టిస్తూ చంద్రబాబు శునకానందం పొందుతున్నాడని మండిపడ్డారు. యువగందరగోళంతో నారా లోకేష్‌ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతున్నాడని, అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా.. వైయస్‌ఆర్‌ సీపీ నేతల అంతు చూస్తాం, వెంటాడుతాం, వేధిస్తామని మాట్లాడుతున్నాడంటే.. తెలుగుదేశం పార్టీ దివాళాకోరు పార్టీగా తయారైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి తనమీద దాడి జరిగిందని చెప్పుకుంటూ ప్రెస్‌మీట్లు పెట్టి కాకిలా అరుస్తున్నాడని, అతడిని చూస్తే పిల్లలకు అన్నం తినిపించేందుకు తల్లిదండ్రులు చెప్పే  బూచోడు సామెత గుర్తుకు వస్తుందన్నారు. కొట్టడానికి 8 మంది క్రరలతో వచ్చారని మాట్లాడుతున్నాడని, దారినపోయే కుక్కనైనా కొడతారు కానీ, చీకట్లో భూతం లాంటోడిని కొట్టే సాహసం ఎవరూ చేయరన్నారు. 

దిక్కుమాలిన వ్యక్తులను అధికార ప్రతినిధులంటూ నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టించి ప్రజలకు మంచిచేస్తున్న ప్రభుత్వాన్ని తిట్టిస్తూ చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నాడని ధ్వజమెత్తారు. పనికిమాలిన వ్యక్తులతో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టిస్తే రోజుకో 10 వేల ఓట్లు టీడీపీకి తగ్గుతాయన్నారు. ఆనం, అయ్యన్న లాంటి వారు నోటికి పనిచెప్పడం తప్ప.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏరోజూ మంచిచేసింది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు కాబట్టి ఆయా కులాలు, వర్గాల ప్రతినిధులను ఏరి వారి ద్వారా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని తిట్టించే నీచమైన సంస్కృతికి చంద్రబాబు దిగజారాడని రవిచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.   

ఒకడికి పదిమందిని తెచ్చుకునే అలవాటు చంద్రబాబుకే సొంతమని, ఎందుకంటే ఒక్కడిగా ఎన్నికలకు వెళ్లలేడు, ఒక్కడిగా వెళ్లి ప్రజలను ఓట్లు అడగలేడు, పదిమందితో పొత్తు ఉంటే తప్ప ఎన్నికలను ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దివాళాకోరు పార్టీగా మారిందన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన టీడీపీని ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు.

సభ్యత, సంస్కారం నేర్చుకొని మాట్లాడాలని నారా లోకేష్‌ను వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు ఆయన కొడుక్కు సభ్యత, సంస్కారం నేర్పకుండా తప్పు చేశాడని, దోపిడీ, ప్రగల్భాలు నేర్పి రాష్ట్రం మీదకు వదిలాడన్నారు. కోడిగుడ్లు విసురుతున్నాడని లోకేష్‌ ఆరోపణలు చేస్తున్నాడని, లోకేష్‌పై వేసేందుకు ఎవరూ గుడ్డు వేస్ట్‌ చేసుకోరని ఎద్దేవా చేశారు. 

ఇప్పటికైనా తండ్రీకొడుకులు వారి పద్ధతి మార్చుకోవాలని, దమ్ముంటే 2014–19 మధ్యకాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం కోసం ప్రజలను కన్వీన్స్‌ చేసుకోవాలి కానీ, అన్ని వర్గాలకు మేలు చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని తిడితే టీడీపీ భవిష్యత్తే కన్ఫ్యూజన్‌లో పడుతుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఆరోపణలు ఎల్లో మీడియాకు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లకు వినసొంపుగా ఉండొచ్చు కానీ, ప్రజలు మాత్రం చీదరించుకుంటున్నారన్నారు. తండ్రీకొడుకులు సమాజానికి పనికొచ్చే వ్యక్తులు కాదని రవిచంద్రారెడ్డి అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top