ఓటుకు నోటులో చంద్రబాబే ప్రధాన ముద్దాయి

టీడీపీ కుంభకోణాలు ప్రజలు గమనిస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌:ఓటుకు నోటు కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఓటుకు కోట్లు కేసు రెండో వీడియో ద్వారా నిరూపణ అవుతుందన్నారు. చంద్రబాబు మూడున్నర కోట్లు మాత్రమే అన్నారని..కాని నేను ఐదు కోట్లకు ఒప్పించానని సెబాస్టియన్‌ అనే వ్యక్తి..స్టీఫెన్‌ సన్‌తో మాట్లాడటం స్పష్టంగా ఉందన్నారు. వీడియోలో కళ్లకు కట్టినట్లు చంద్రబాబు వ్యవహారం కనబడుతుందన్నారు. ఆ వీడియో ఉన్నది చంద్రబాబు గొంతేనని చాలా స్పష్టంగా ఉందన్నారు.గతంలో మొదటి వీడియోలో చంద్రబాబు స్పష్టంగా మాట్లాడరని,ఆ వీడియోను బలపరుస్తూ తాజాగా బయటకొచ్చిన రెండవ వీడియోలో బాబు ఏవిధంగా బేరాలు అడిరన్నా విషయం స్పష్టంగా నిరూపితమవుతుందన్నారు.ఒక ఎమ్మెల్యేను కొనడానికి,ఎమ్మెల్సీ ఎన్నికల కోసం,తెలంగాణలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడం కోసం చంద్రబాబు బేరాలకు దిగారని తెలిపారు.సెబాస్టియన్,స్టీఫెన్‌సన్‌ల మధ్య చంద్రబాబు ప్రస్తావన స్పష్టంగా ఉందన్నారు.ఇంత స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నా.. కుట్ర సిద్ధాంతం మీద బయట పడాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఓట్లకు కోట్లు  వ్యవహారంలో రెడ్‌  హ్యండెడ్‌గా పట్టుబడ్డారని, ఐటి గ్రిడ్స్‌లో డేటా చోరీ కేసులో మరో పెద్ద కుంభకోణం అని అన్నారు.టీడీపీ కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.తప్పులు చేసి ఏపీ,తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారన్నారు.రూ.కోట్లు కుమ్మరించి బాబు,రేవంత్‌ టీమ్‌ ఎమ్మెల్సీని కొనేందుకు చూశారన్నారు.ఏపీలోని 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది ఎప్పటికైనా బయటకొస్తుందన్నారు.చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

   
Back to Top