మంత్రి పార్ధసారధివి దిగజారుడు మాటలు

మిథున్ రెడ్డి మాటలకు వక్రభాష్యాలా ?

మావిగన్ చర్చను డైవర్ట్ చేసే యత్నం

మంత్రులకు సింగపూర్ టూర్ ఎందుకో ?

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపణ

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని 
భరత్

బీఆర్ అంబేద్కర్ కు నిజమైన వారసుడు జగన్

మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశారు

కూటమి సర్కార్ లో బలహీన వర్గాలపై దాడులు

అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రెడ్ బుక్ అమలు

ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు

జగన్ చెప్తే దేశం, రాష్ట్రం కోసం త్యాగం చేస్తామన్నారు

దానికి ఉన్మాదులు, టెర్రరిస్టులంటూ వక్రభాష్యాలా ?

మంత్రి అని మర్చిపోయి పార్ధసారధి దిగజారుడు మాటలు 

 అమరావతిపై చంద్రబాబు పులిస్వారీ

మంత్రులకు సింగపూర్ లో శిక్షణ ఎందుకు?

జైలుకెళ్లిన సింగపూర్ మంత్రిగా శిక్షణ ఇప్పిస్తారా ?

గతంలో రైతుల్నీ ఇలాగే తీసుకెళ్లి మోసం చేశారు

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టీకరణ

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి సర్కార్ నానా తిప్పలు పడుతోందని, తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పార్ధసారధి వక్రభాష్యాలే ఇందుకు నిదర్శనమని పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి చుట్టూ తిరగడం మాని ఇప్పటికైనా జగన్ గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదనపై ఆలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. 9 మంది మంత్రుల్ని సింగపూర్ టూర్ కు తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భరత్.. వారికి జైలుకెళ్లిన అక్కడి మంత్రి ఈశ్వరన్ తో శిక్షణ ఇప్పిస్తారా అని ఎద్దేవా చేశారు.
ప్రెస్ మీట్లో మార్గాని భరత్ ఇంకేమన్నారంటే...

- అంబేద్కర్ కు నిజమైన వారసుడు జగనే

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పూలేల నిజమైన వారసుడిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు, మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50 శాతం రిజర్వేషన్ అమలు చేసారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలపైన దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబుక్కు పట్టుకుని మేం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే ఇవాళ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. గతంలో అంబేద్కర్ జయంతికీ, వర్దంతికీ తేడా తెలియకుండా మాట్లాడారు. ఇవాళ తెలిసి మరీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.  

- మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పార్ధసారధి వక్రభాష్యాలు

మా ఎంపీ మిథున్ రెడ్డి .. అధినేత జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని చెప్పినట్లు మంత్రి పార్ధసారధి తన ప్రెస్ మీట్లో చెబుతున్నారు. దానర్థం జగన్మోహన్ రెడ్డి చెప్తే దేశం కోసం, రాష్ట్రం కోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు. కానీ గతంలో మా పార్టీలో పని చేసి వెళ్లిన పార్ధసారధి.. ఆ మాత్రం విజ్ఞత లేకుండా మాట్లాడటమేంటి ? ప్రతీ దానికీ వక్రభాష్యాలు వెతుక్కుంటారా ? మిమ్మల్ని ఉన్మాదులు టెర్రరిస్టులు అంటూ పార్ధసారధి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. అగ్రనాయకత్వం ఆలోచన తప్పు ఉంటే చర్చించాల్సింది పోయి గుడ్డిగా అనుసరిస్తారా అంటూ మంత్రి పార్దసారధి మాట్లాడుతున్నారు. ఏబీఎన్ వీకెండ్ కామెంట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా నేతలు సొంత భార్యల్ని చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారంటూ నీచపు వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలు దీనికి కొనసాగింపులా ఉన్నాయి. ఏబీఎన్ వ్యాఖ్యల్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సమర్థించడం కూడా చూశాం. వీళ్ల ఇళ్లలో ఉన్న వాళ్లే ఆడవాళ్లు, వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లలో వారు ఆడవాళ్లు కాదా ?

- సింగపూర్ లో మంత్రులకు శిక్షణ అవసరమా ?

21 నుంచి సింగపూర్ లో 9 మంది మంత్రులకు శిక్షణా తరగతులు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో రైతుల్ని ఇలాగే స్పెషల్ ఫ్లైట్లతో తీసుకెళ్లి చూపించి, ఆ తర్వాత నట్టేట ముంచారు. ఇప్పుడు మంత్రుల్ని తీసుకెళ్తామంటున్నారు. వారికి గతంలో జైల్లో పెట్టిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో శిక్షణ ఇప్పిస్తారా చెప్పండి ? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యమైన మావిగన్ అనే ప్రతిపాదన ప్రజల ముందు పెట్టారు. దానికి టీడీపీ ఇచ్చిన ప్రచారానికి మావిగన్ పై ప్రజల్లో విస్తృతమైన చర్చ కూడా జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ఓ కారిడార్ గా మారి, సాగరమాల పథకంలో భాగంగా ఓ అద్భుతమైన పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా రాబోతోంది. ప్రజల్ని ఇందులో భాగస్వాముల్ని చేస్తూ వారిని అభివృద్ధి చేయాలని చూస్తుంటే మీరు ఓర్చుకోలేక పోతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మరోవైపు వేల కోట్లు అప్పులు చేస్తూ, ఒకే ప్రాంతానికి పెడుతూ అదే కరెక్ట్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా నీళ్లు ఎత్తిపోయడానికి రిజర్వాయర్లు కడుతున్న పరిస్ధితులు లేవు. కానీ మచిలీపట్నం-విజయవాడ--గుంటూరు ప్రణాళిక ఆచరణ సాధ్యమని ప్రజల్లో పెడ్తుంటే తప్పుబడుతున్నారు. దాని మీద చర్చకు రండి. రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారో చెప్పాలి. అమరావతిలో మీరు చేస్తోంది పులిస్వారీ. అక్కడ లక్షల కోట్లు పెట్టి రాష్ట్ర ప్రజల్ని సైతం పులిస్వారీ చేయించాలని చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ డబ్బు వృథా చేస్తున్నారు. మేం అడిగితే లోకేష్ సొంత డబ్బులతో వెళ్తున్నామని బుకాయిస్తున్నారు. మరి విపక్షంలో ఉండగా ఎందుకు ఇలా స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లలేదో చెప్పాలి. 

- జగన్ మావిగన్ ప్రతిపాదనపై జనంలో విస్తృత చర్చ

జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక ప్రజల్లో మావిగన్ పై చర్చ జరుగుతోంది. అమరావతితో పోలిస్తే ఎత్తైన ప్రాంతం ఉంది, మచిలీపట్నం పోర్టు ఉంది కాబట్టి అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఈ ప్రతిపాదన చేశారు. ఓ 20 వేల కోట్లు పెడితే మంచి రాజధాని వస్తుంది కదా. సాగరమాల ప్రాజెక్టులో వైజాగ్ తోనూ ఇది కనెక్ట్ అవుతుందనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. నయా రాయపూర్ లాగే అమరావతిలోనూ పది భవనాలు కట్టేస్తే ఉదయం పని చేసుకోవడానికి వెళ్లి సాయంత్రానికి తిరిగి విజయవాడ రావాల్సి వస్తుంది. అలాగే ప్రతీ వర్షాకాలం పంపులు పెట్టి నీళ్లు తోడాలి. ప్రజల్ని ఎక్కడి నుంచి అమరావతికి తీసుకొస్తారు. రేపు అమరావతిలోనూ ఇదే జరగబోతోంది. చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీని రంగారెడ్డి జిల్లాలో సుమారు 250 కోట్లతో పెడుతున్నారు. చంద్రబాబు అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఆ పెట్టుబడి ఏదో ఇక్కడే పెట్టొచ్చు కదా. మీరు అమరావతిలో పాలు పితుక్కుని హైదరాబాద్ లో వెళ్లి పెట్టుబడిగా పెడుతున్నారు. మీరు, మీ అబ్బాయి లోకేష్, పవన్ కళ్యాణ్ అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అమరావతిని మీరు కాదు, మీ పిల్లలు కూడా మహానగరంగా చూడలేరు. 

- మావిగన్, అమరావతికీ మధ్య తేడా ఇదే

అమరావతి రైతుల్ని హైదరాబాద్, సింగపూర్ తీసుకెళ్లి చూపించి నమ్మించారు. హైదరాబాద్ లో బిల్డింగ్ లు నేనే కట్టాను, మీకు ఇచ్చే ఒక్కో గజం కోట్ల రూపాయలు అయిపోతుందని చెప్పి భూములు తీసుకున్నారు. మీ బినామీలతో వేల కోట్ల విలువైన భూములు కొనిపించారు. అమరావతిలో 29 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, మీ బినామీలు తప్ప అక్కడ ఎవరూ లేరు. అదే మావిగన్ తీసుకుంటే సుమారు 44 లక్షల మంది ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. దాన్ని వదిలేసి మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ అమరావతికి ఒప్పుకుంది, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదని కూడా అడుగుతున్నారు. మీరు 2014లో కేంద్రంలో భాగస్వామిగా ఉండి లక్షల కోట్ల నిధులు తెస్తారని, అమరావతిని అభివృద్ధి చేస్తారని భావించాం. కానీ రాను రానూ ఆ నమ్మకం సడలిపోయింది. అందుకే ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన చేస్తున్నాం. ముందు మేం విశాఖ చెప్తే మీకు నచ్చలేదు. అందుకే బెస్ట్ ఆప్షన్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ చేయాలని కోరుతున్నాం. ప్రజల్ని కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాం. 

- మీ బాకాలతో జగనన్న, భారతమ్మపై దుష్ప్రచారం 

ఎం9, థింక్ ఆంధ్రా వంటి దిగజారుడు మీడియాలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జగనన్న, ఆయన శ్రీమతి భారతమ్మ గారి ఫొటోలు పెట్టి నీచ ప్రచారానికి దిగారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై భారతమ్మ కేసు పెట్టిందని మీకు తెలుసా ?, వైఎస్సార్ పరువు కాపాడటానికి చంద్రబాబు కృషి చేశారట. వార్తలు లేకపోతే వేరే విషయాలు రాసుకోండి. అంతే కానీ ఆది దంపతుల్లా మేం భావించే జగన్మోహన్ రెడ్డి దంపతులపై దారుణమైన ప్రచారాలు చేయకండి. లోకేష్ కు ఇదే చెప్తున్నా. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్న విషయం లోకేష్ గుర్తుంచుకోవాలి. చట్టం మీ చుట్టమేం కాదు.. రోజులన్నీ ఒకేలా ఉండవు. కాలచక్రం తిరిగినప్పుడు అవే పాపాలు మిమ్మల్ని వెంటాడతాయన్న విషయం లోకేష్ గుర్తుంచుకోవాలి. ఏబీఎన్ రాధాకృష్ణతో వైయ‌స్ఆర్‌సీపీ మహిళలు, నాయకుల భార్యల గురించి చెప్పించాలి. ఆ తర్వాత పనికిమాలిన వెబ్ సైట్లలో జగనన్మ, భారతమ్మపై దుష్ప్రచారాలు చేయిస్తున్నారు. భారతమ్మ తన భర్త జగన్మోహన్ రెడ్డిపై హైదరాబాద్ పంజాగుట్ట స్టేషన్ లో కేసు పెడితే సీఎంగా ఉన్న చంద్రబాబు సెటిల్ చేయించారట. మీరు ముఖ్యమంత్రా లేక వార్డు మెంబరా చెప్పాలని మార్గాని భరత్ అక్షింతలు వేశారు.

Back to Top