తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (15.04.2026) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరే ఆయన, కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు అక్కడి ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించనున్నారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు.