ఇంటింటికీ “జై భీమ్” నినాదం

అదే జగన్‌ విధానంగా రాష్ట్ర‌మంతా మార్మోగాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నేతల పిలుపు

తాడేపల్లి లోనివైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున‌, ఆదిమూల‌పు సురేష్‌, మేక‌తోటి సుచ‌రిత‌, వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌ రావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌, ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ చైర్‌ప‌ర్స‌న్ అమ్మాజీ, ప‌బ్లిసిటి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు కాక‌మాను రాజ‌శేఖ‌ర్‌, వంగవీటి నరేంద్ర, వేల్పుల రవికుమార్, రవిచంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాడేప‌ల్లి: “జై భీమ్” నినాదం ఇంటింటికీ చేరాలని, అదే శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి విధానంగా రాష్ట్రవ్యాప్తంగా మార్మోగాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి గారు  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆలోచ‌న విధానంతో గ‌త ఐదేళ్లు పాల‌న చేసి అన్ని వ‌ర్గాల‌కు మేలు చేశార‌ని నేత‌లు గుర్తుచేసుకున్నారు.  తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో అంబేద్కర్ చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు ఏమ‌న్నారంటే..వారి మాట‌ల్లోనే..

- “జై భీమ్ నినాదం ఇంటింటికీ చేరాలి: మాజీ మంత్రి మేరుగు నాగార్జున 

 దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ముదాహంగా భావిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులను మార్చడానికి ఈ భూమిపైకి వచ్చిన అత్యంత మేధావి అంబేద్కర్‌. దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఈ రోజు ఇతర దేశాలు కూడా ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయి. పేదలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, అవకాశాలు కల్పించిన మహానీయుడు ఆయన.

దేశం, రాష్ట్రంలో రాజ్యాంగానికి లోబడి పాలన జరగాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోంది. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను అపహాస్యం చేస్తున్నారు. నాడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థను ప్రతిష్టించి, సంక్షేమ పథకాలను గడప వద్దకే అందించారు. పేదవాడికి చదువే గొప్ప ఆస్తి అని అంబేద్కర్ చెప్పిన ఆలోచనను జగన్ గారు అమలు చేశారు. కానీ ఈ రోజు ఆ దిశగా పాల‌న సాగ‌డం లేదు. కూట‌మి పాలనలో అక్షరాస్యత తగ్గింది. ‘అమ్మ ఒడి’ ఏమైంది? ఆరోగ్య సేవలు ఎక్కడ? ఆరోగ్యశ్రీ పేదలకు అందకుండా చేస్తున్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లే దాడులు చేస్తుంటే రాజ్యాంగం ఎక్కడికి వెళ్తుంది?

‘జై భీమ్’ నినాదం ఇంటింటికీ వెళ్లాలి. అది జగన్ నినాదంగా మార్మోగాలి. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అంబేద్కర్ ఆశయాలు విరాజిల్లుతాయి.

- ప‌దే ప‌దే వైయస్ జగన్ ఆలోచన విధానం గుర్తుకొస్తోంది: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. దళితులకు ఈ ప్రభుత్వం చేసింది శూన్యం. అందుకే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలన పదేపదే గుర్తుకు వస్తోంది. డా. బి.ఆర్. అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని జగన్ గారు గ‌త ఐదేళ్లు పాలన చేశారు. కానీ ఇవాళ రాష్ట్రంలో అంబేద్కర్ భావజాలానికి విరుద్ధంగా పాలన సాగుతోంది. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేసినా కూడా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండేపిలో అంబేద్కర్, పూలే విగ్రహాల ఏర్పాటు సమయంలో దళితుల మధ్య వర్గవైషమ్యాలు సృష్టించి గొడవలు పెంచారు. దాంతో దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ గారు నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబు అడ్డుకున్నారు. ఈ కూటమి పాలనలో అరాచకాలకు అంతు లేదు. సామాజిక న్యాయం కనుమరుగైంది. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. సోషల్ జస్టిస్ విగ్రహాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇంగ్లీష్ మీడియం విద్య మళ్లీ రావాలంటే జగన్ గారు రావాలి. రాబోయే రోజుల్లో ఐక్యతతో ముందుకు సాగి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన నాయకుడు జగన్ గారినే మళ్లీ సీఎం చేసుకోవాలి. 

- అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు జగన్: మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత 

అంబేద్కర్ ఆలోచన విధానపరంగా పరిపాలన చేసింది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. ఆయన అమలు చేసిన పథకాలు దళితులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.  ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్య అందించారు. గుడిసెల్లో జీవించే పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సమసమాజం కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలని భావించిన గొప్ప నాయకుడు జగన్ గారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించారు. గుంటూరులో దళిత బాలిక హత్య జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం ఇచ్చి న్యాయం చేశారు. ‘జై భీమ్’ నినాదంతో మాకు ధైర్యం ఇచ్చిన జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

- ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే రాజ‌ధాని ఉండాలి: జూపూడి ప్రభాకర్‌రావు

‘జై భీమ్’ నినాదంలో ‘జై’ అంటే వర్ధిల్లాలి, ‘భీమ్’ అంటే జ్ఞానం… అంటే జ్ఞానం వర్ధిల్లాలనే అర్థం అంబేద్కర్ గారికి వర్తిస్తుంది.  ఏప్రిల్ నెలలోనే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ గారు జన్మించారు. డాక్టర్ వైయస్‌ఆర్ హ‌యాంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలనను చూశాం. 2019–2024 మధ్య అంబేద్కర్ ఆశయాలను జగన్ గారు తన పాలనలో ఆచరణలో చూపించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు కారిడార్‌ను ‘మావిగన్’గా అభివృద్ధి చేయాలని జగన్ గారు ప్రతిపాదించారు. ప్రజల మధ్యలోనే రాజధాని ఉండాలి… పొలాల మధ్య కాదు. మనుషులు ఉన్న చోటే రాజధాని ఉండాలి. అదే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైన అభివృద్ధి.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే డిసెంట్రలైజేషన్ అవసరం. ఒక్క ప్రాంతంలోనే పెట్టుబడులు కేంద్రీకరించడం సరైంది కాదు. జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ భావనను అంబేద్కర్ ఆశయాల కోణంలో చూడాలి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే క్రమంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాలను అంబేద్కర్ వాదులంతా బలపరచాలి. దేశంలోని మేధావులంతా కూడా మావిగన్ ప్రతిపాదనపై ఆలోచించాలని కోరుతున్నాను.

- వంద‌లాది మంది అంబేద్క‌ర్లు మ‌ళ్లీ పుట్టాలి : టీజేఆర్ సుధాకర్‌బాబు 

మా గుండెల్లో బాధ ఉంది. ఈ ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. జనసేనకు చెందిన మహిళపై దాడి జరిగినా చర్యలు లేవు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెత్తందార్ల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. టీ తాగేందుకు కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఈ ఘటనలను ఖండించలేదు. డప్పు కళాకారుడిపై స్పీకర్ దాడి చేసినా స్పందన లేదు. అందుకే వందల, వేల అంబేద్కర్లు పుట్టాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఇళ్లు కట్టుకుని జీవించాలి అనుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకున్నారు. సామాన్యుడు బతకాలంటే జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ‘జై భీమ్–జై జగన్’ నినాదాన్ని వాడవాడలో వినిపిస్తాం. జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యం. 

- అంబేద్కర్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్లారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితో అనేక దేశాలు ముందుకు సాగుతున్నాయి. కులాలు, మతాలకు అతీతంగా భారతీయులందరికీ మార్గదర్శకమైన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ ఆశయాలను పునాదిగా చేసుకుని సమాజంలో అసమానతలను తొలగించే దిశగా జగన్ గారు పనిచేశారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేలా పాలన కొనసాగించారు.

- వైయ‌స్ జ‌గ‌న్ అభివ‌న అంబేద్క‌ర్‌: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌

అందరి ఆరాధ్య దైవం డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పకడ్బందీగా అమలు చేసింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే. చాలా పార్టీలు అంబేద్కర్‌ను ఓటుబ్యాంక్‌గా మాత్రమే చూశాయి. కానీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే ఆయన ఆలోచనలు, ఆశయాలను తూచతప్పకుండా అమలు చేసింది.
మహిళా హక్కుల విషయంలో కూడా అంబేద్కర్ చాలా ముందే చెప్పినా, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత జగన్ గారిదే. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి ప్రతి రంగంలోనూ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించారు. అందుకే మేమంతా ఆయనను ‘అభినవ అంబేద్కర్’గా పిలుస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దళితుల ఆత్మగౌరవం దెబ్బతింటోంది. మమ్మల్ని మనుషులుగా కూడా చూడని పరిస్థితి ఉంది. మళ్లీ అంబేద్కర్ ఆశయాలు బతకాలంటే, సమాజంలో ఆత్మగౌరవం నిలవాలంటే జగన్ గారు తిరిగి అధికారంలోకి రావాలి.

- అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేస్తాం: మాజీ ఎంపీ మార్గాని భరత్

ఆ రోజుల్లో డా. బి.ఆర్. అంబేద్కర్ గారు ‘మేమంతా పూలే వారసులం’ అని చెప్పి సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అసమానతలను తొలగించారు. ప్రజాస్వామ్య భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. ఇవాళ సమాజంలో కుల వివక్ష మళ్లీ పెరుగుతోంది. పూలే వారసుడిగా అంబేద్కర్ నిలిచారు. అదే ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గొప్ప పాలన అందించి దిక్సూచిగా నిలిచారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలి.

- సామాజిక న్యాయం సాధించాలంటే వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ రావాలి: కనకరావు

ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ అణగారిన వర్గాలు ఏకమై ముందుకు సాగాలని భావించిన మహానుభావుడు. కానీ ఇవాళ ఆయన స్ఫూర్తి కనుమరుగవుతోంది. దళితుల రక్షణ ఎండమావిగా మారింది.
సామాజిక న్యాయం సాధించాలంటే, అణగారిన వర్గాలకు అధికారం రావాలంటే వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిందే.

Back to Top