శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైయస్ జగన్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను ఆయన నివాసంలో కలిసి శ్రీమన్నారాయణ మహాయజ్ఙ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి వారు

కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్ధానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం

ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించి, అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించిన వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌కు ఆలయ విశిష్టతను వివరించి, మహాయజ్క్షానికి ఆహ్వనించిన జీయర్‌ స్వామి

దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకువస్తాయని, ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయన్న వైయస్‌ జగన్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌బాబు, కోడూరు జెడ్పీటీసీ యాదిరెడ్డి సత్యనారాయణ, మహాయజ్ఞ కమిటీ సభ్యులు బూరగడ్డ హరినాథ్‌ బాబు, మందపర్తి సత్య శ్రీహరి, మద్దాని ప్రసాద్‌, జూపూడి బోస్‌ తదితరులు.

Back to Top