తాడేపల్లి: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.