చిత్తూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. రాప్తాడులో ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కుప్పంకు తరలించారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గిరీష్ రెడ్డిపై 76/2026గా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.