ప్రజల జీవితాలతో టీడీపీ ఆటలు

సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడు

డేటా చోరీపై టీడీపీ స్పష్టమైన ప్రకటన చేయాలి

చంద్రబాబు..డొంక తిరుగుడు వ్యాఖ్యలు మానుకో

వైయస్‌ఆర్‌సీసీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు

విజయవాడ:.వైయస్‌ జగన్‌ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహకారం అందిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. డేటా చోరీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదన్నారు.ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైందన్నారు.చంద్రబాబు చేతగాని దద్దమ్మలను మీడియా ముందుకు వదిలి అవాస్తవాలను ప్రచారం చేయిస్తాడని మండిపడ్డారు.పక్క రాష్ట్రాల నాయకులపై ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన  కర్మ వైయస్‌ జగన్‌కు పట్టలేదన్నారు.ఏపీ ప్రజలు వైయస్‌ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని సొంతబిడ్డలా చూస్తున్నారని తెలిపారు.వైయస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి కష్టమోస్తే తన కష్టంగా ఏపీ ప్రజలు భావిస్తున్నారన్నారు.మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో దారుణమైన కుట్ర జరిగిందని, ప్రజలకు సంబంధించి వ్యక్తిగత సమాచారం దొంగిలించబడిందన్నారు.

ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి పారదర్శకత నిరూపించుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్‌లు తీసుకుందని విమర్శించారు.ఇది కొత్త కాదని చంద్రబాబు గతంలో కూడా యూటర్న్‌లు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి విచారణకు ఆదేశిస్తే..ఫోన్‌ ట్యాపరింగ్‌ చేశారని నేను కూడా కేసు పెడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగరన్నారు.తెలంగాణ ప్రభుత్వం వారి పరిధిలో ఉన్న ఒక స్టాఫ్‌వేర్‌ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయిందని ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు  ఆ కంపెనీపై దాడిచేస్తే  చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. అశోక్‌ అనే వ్యక్తి ఇప్పటికూడా ఎందుకు పరారీలో ఉన్నాడని ప్రశ్నించారు.ఆయన నిజంగానే పారదర్శకంగా ఐటి కంపెనీని నడుపుతుంటే..ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ స్వప్రయోజనాలు కోసం వాడుకోకుండా ఉంటే ఎందుకీ డొంక తిరుగుడు మాటలు అని ప్రశ్నించారు.

అవాస్తవాలను కప్పిపుచ్చుకోవడం సినిమా ఆరిస్టును చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.రాజకీయాలు అంటే ఓనమాలు తెలియని  పెయిడ్‌ ఆరిస్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.డేటా చోరీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదన్నారు.రాజకీయాలంటే ప్రజల మనసులు గెలవాలని, ప్రజలోంచి పుట్టాలని చెప్పిన వైయస్‌ఆర్‌ ప్రజల గుండెల్లో ఇప్పటికి నిలిచిపోయారన్నారు.రాజకీయ విలువలు,విశ్వసనీయత పునాదుల మీద వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిలబడ్డారన్నారు.వైయస్‌ జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టి వైయస్‌ జగన్‌పై  కేసులు పెట్టి అనేక కుట్రలు చేశారన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తులు పెట్టుకోవడం ద్వారా అది బట్టబయలు అయ్యిందన్నారు.సీఎంగా చంద్రబాబు అనర్హుడు అని అన్నారు.ప్రజల సమాచారాన్ని ఏపీ సర్కారు ఐటి గ్రిడ్స్‌కు తాకట్టు పెట్టిందన్నారు.జీవో 75 ద్వారా ప్రజల డేటాను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టారన్నారు.ప్రజల జీవితాలతో టీడీపీ ఆడుకుంటుందన్నారు. 

Back to Top