రాష్ట్రంలో ఆటవిక పాలన 

వైయ‌స్ఆర్‌సీపీ హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దీపిక ఫైర్‌

ఉప్పాల హారిక‌పై దాడికి నిర‌స‌న‌గా హిందూపురంలో మ‌హిళ‌ల నిర‌స‌న కార్య‌క్ర‌మం

శ్రీ స‌త్య‌సాయి జిల్లా: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దీపిక మండిప‌డ్డారు. గుడివాడలో 3 రోజుల క్రితం కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారు పై జ‌రిగిన దాడిని నిర‌సిస్తూ మంగ‌ళ‌వారం హిందూపురంలో దీపిక ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. చిలమత్తూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత "డాక్టర్ అంబేద్కర్ష‌  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, బీసీ మహిళ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  దీపికమ్మ మాట్లాడుతూ.. `ఒక బీసీ మహిళ అని కూడా చూడకుండా హారిక‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండ‌గా  టిడిపి, జనసేన గూండాలు ఆమె కారు పై దాడి చేయడం  అన్యాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, టిడిపి గుండాలు జిల్లా ప్రథమ మహిళ అయిన జడ్పీ చైర్ పర్సన్ మీదే దాడికి పాల్పడితే, ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడుంది, ఎవరు ఇస్తారు ?  మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా ?  చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారింది, గతంలో ఆడపిల్లల మీద చేయి వేస్తే అదే చివరి రోజు అవుతున్న చంద్రబాబు , టిడిపి గుండాలు మహిళలపై ఇంత రెచ్చిపోతున్న ఎందుకు పట్టించుకోవడం లేదు ? ఇది ఎంతవరకు సమంజసమా?  చంద్ర‌బాబు కక్షపూరిత ధోరణి మానుకొని ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి` అని హిత‌వు ప‌లికారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగమణి, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రెటరీ సురేష్ రెడ్డి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కవితా రెడ్డి, కౌన్సిలర్ షాజియా, నియోజకవర్గ అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు సిద్ధగంగమ్మ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Back to Top