చంద్రబాబు వీధి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌

దళితులను కించపరిచిన చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు

దళితులను అవహేళన చేసిన ఆదినారాయణరెడ్డిపై చర్యలేవి

రాష్ట్రంలో  దళితులకు మాట్లాడే హక్కు లేదు..ప్రశ్నిస్తే కేసులా?

దళితుల్లారా ఆలోచించండి

హైదరాబాద్‌: దళితులు నిజాలను అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు వీధి రౌడీలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను హేళనగా మాట్లాడిన చింతమనేని ప్రభాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సిద్ధాంతపరమైన వైరుధ్యాలు వచ్చాయి. మా మనోభావాలు దారుణంగా దెబ్బతింటున్న రోజులు. బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తామన్న చంద్రబాబు..చింతమనేని అనే ఒక బజార్‌ రౌడీని పార్టీ విప్‌గా పెట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండించలేదు. మీరు దళితులు..మీకేందుకురా రాజకీయాలు అంటున్నా..కూడా ఇంకా విప్‌గానే పెట్టుకొని కట్‌ టు పేస్టు చేశారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు.

మాలలు, మాదిగలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ఉనికికి ప్రమాదం జరుగుతుంది. మనల్ని మనషులుగా కూడా గుర్తించలేని ప్రభుత్వం ఒకవైపు ఉంటే..ఆ ప్రభుత్వాన్ని నడిపే అధినేత అయిన చంద్రబాబు ..దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? ఆయన చెప్పిన సందర్భం. ఇంకోపక్కా ఆదినారాయణ అనే ఇంకో మంత్రి దళితులు శుభ్రంగా ఉండరు..చదువుకోరు..వాసన వస్తుందని అంటారు. వర్ల రామయ్య అనే టీడీపీ నేత మా దళిత సోదరుడిని పట్టుకొని బస్సులో కూర్చొన్న యువకుడిని కులం పేరుతో దూషించారు. చింతమనేని ప్రభాకర్‌ కూడా దళితులను అనుచితంగా మాట్లాడారు.

ఇదీ దళితుల పట్ల టీడీపీ నేతల వైఖరి. దళిత సమాజం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ప్రకాశం జిల్లాలో దళితుల భూములు లాక్కుంటున్నారు. మరో జిల్లాలో దళిత మహిళ భూమి లాక్కున్నారు. అడిగితే ఆ మహిళను వివస్త్రను చేశారు. చంద్రబాబు పరిపాలనలో సామాన్యులçపై జరుగుతున్న దాడిగా వైయస్‌ఆర్‌సీపీ భావిస్తోంది. మాల మాదిగలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరిపాలన దక్షిడని, అనుభవం ఉందని అధికారం ఇస్తే..ఆయన దళితులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. చింతమనేని ప్రభాకర్‌ దళితులను అవహేళనగా మాట్లాడితే..పప్పునాయుడు లోకేష్‌ మాత్రం చప్పట్లు కొట్టారని చెబుతున్నారు. నారా లోకేష్‌ ..నీకు సిగ్గుందా? కనీస జ్ఞానం లేని మనిషి లోకేష్‌. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏకు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. దళితులుగా పుట్టడానికి, బతకడానికి, మాట్లాడటానికి, ప్రశ్నించడానికి హక్కు లేదా? ఈ రోజు దళిత బిడ్డగా కడుపు మండింది. మిమ్మల్ని జుట్టు పట్టుకొని బజారులోకి లాగి కొట్టే రోజులు వస్తాయి. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో మాట్లాడే హక్కు లేదు. 

నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి చంద్రబాబే. ఇదే చింతమనేని ప్రభాకర్‌ మహిళా అధికారిణి జుట్టుపట్టుకొని లాగితే కేసు నమోదు చేయలేదు. గోదావరి పుస్కరాల్లో 29 మంది చనిపోయారు. చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌ మళ్లీ ఓట్ల కోసం వస్తారు. చిలుకలూరిపేటలో బీసీ రైతును కొట్టి చంపారు. సాక్షులను మాయం చేసిన మీ కుయుక్తులను అడ్డుకుంటాం. వైయస్‌ జగన్‌ మాకు అండగా ఉంటారు. రాజ్యాంగపరమైన హక్కులను అనుభవించేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మాకు స్వాతంత్య్రం ఉండేది. ఎన్ని టక్కుటమారా దొంగ పనులు చేసినా మా ఓటు వైయస్‌ఆర్‌సీపీకే.  
 

Back to Top