టీడీపీకి దళితులు గుణపాఠం చెబుతారు..

చంద్రబాబు బాటలోనే టీడీపీ నేతల వ్యాఖ్యలు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజే సుధాకర్‌ బాబు 

పశ్చిమగోదావరి:చంద్రబాబు బాటలోనే టీడీపీ నేతలు దళితులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజే సుధాకర్‌ అన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని  గతంలో వ్యాఖ్యనించిన చంద్రబాబేపైనే ఎలాంటి చర్యలు లేవన్నారు. సహచర మంత్రులు కూడా దళితులు శుభ్రంగా ఉండరు,చదువుకోవడం రాదు అంటూ  వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.దళితుల పట్ల టీడీపీ నేతలు కాండకావరంతో వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. దళితులు టీడీపీ గుణపాఠం చెప్పాలన్నారు.

దళితులను అవమానించడం టీడీపీ సిద్ధాంతపరమైన వైఖరిగా అభివర్ణించారు. దళితుల మీద చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దళిత సమాజం వైయస్‌ఆర్‌ కుటుంబంపై అమితమైన ప్రేమకనబరుస్తుందన్నారు.చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేసిన పప్పులు ఉడకడం లేదన్నారు.దళితులపై ఎన్ని దాడులు చేసినా, బెదిరింపులకు దిగినా దళిత సమాజం బెదరదన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులను ఎంత శాతం ఖర్చుపెట్టారోచంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.

 

Back to Top