సత్యవేడు ఎమ్మెల్యేపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి

 వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పి.శివశంకర్‌ డిమాండ్‌

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ప్రవర్తన అత్యంత దారుణం

కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టడం ఏ మాత్రం సరికాదు

సభ్య సమాజం తలదించుకునేలా ఆయన ప్రవర్తన

బాధితురాలు పక్క రాష్ట్రంలో సమస్య చెప్పుకునే పరిస్ధితి 

రాష్ట్రంలో పాలన ఉన్నట్లా? లేనట్లా?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన శివశంకర్‌

తాడేపల్లి: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రవర్తన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని వైయ‌స్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ మండిపడ్డారు. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం చేయడంతో పాటు, హత్యాయత్నం చేశారని టీడీపీకే చెందిన ఒక మహిళ ఆరోపణలు చేయడం, ఆ పార్టీకే సిగ్గుచేటని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపిస్తున్న ఆ మహిళ ఏపీలో కాకుండా, పక్క రాష్ట్రంలో మీడియాతో మాట్లాడిందంటే, తను ఎంత భయపడుతుందో అర్ధమవుతోందన్నారు. ఒక ఎమ్మెల్యే అంత దారుణంగా వ్యవహరించడం, బాధితురాలు ఏకంగా పూర్తి సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు రావడాన్ని ప్రస్తావించిన శివశంకర్, అసలు ఏపీలో ఇదేనా పాలన? అని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ గురువారం మీడియాతో మాట్లాడారు.

    సత్యవేడు ఎమ్మెల్యేను కేవలం సస్పెండ్‌ చేసి ఊర్కోవడం సరికారు. ఆయనపై అత్యాచారం, హత్యాయత్నం రెండు కేసులూ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

Back to Top