తాడేపల్లి : అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని అన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. సుధాకర్‌బాబు ఏమన్నారంటే.. పద్ధతి ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా దసరా పండుగ సందడిలో ఉంటే ... తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని తేల్చి చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా.... గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ... దోపిడీకి తెరలేపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందికి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది? టన్ను ఇసుక తవ్వాడానికి రూ. 90 నుంచి 120 గా బేస్ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ. 50 నుంచి రూ. 60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుకున్న మర్మమేంటని నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమని చెప్పారు. ఇసుక టెండర్లు దక్కించుకోవడానికి అతి తక్కువ ధరకు కోట్ చేయడం, సామాన్యులు బెదిరించడం, దౌర్జన్యం చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతూ తెలుగు తమ్ముళ్ల బరి తెగించారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 రీచ్ లుకు, 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్ లు స్వీకరించి ఖరారు చేసేసారని, అలాగే కర్నూలులో అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే . ఒక్క టెండర్ వస్తే బిడ్ ను ఓకే చేసారని తెలిపారు. వైయస్ఆర్ , పల్నాడు, తూ. గో , ప.గో, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చితూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక బుకింగ్ లేనే లేదని, తెలుగు తమ్మళ్లు, బీజేపీ, జనేసేన నేతలతో కలసి బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. టన్ను ఇసుక తవ్వాడానికి రూ. 90 నుంచి 120 గా బేస్ ధరగా నిర్ణయించగా, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ. 50 నుంచి 60 తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం అవినీతి ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. వైయస్ఆర్, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చితూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక బుకింగ్ లేనే లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ రీచుల్లో గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను నాలుగు నెలల కాలంలో అమ్ముకున్నారని,కూటమి పాలనలో ఇదో అంతర్జాతీయ కుట్ర అని మండిపడ్డారు. ఇసుకను వంద శాతం ఉచితంగా ఇవ్వాల్సిందేనని, ఇసుక విధానాన్ని తక్షణమే ప్రకటించాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని సుధాకర్ బాబు డిమాండ్ చేసారు. లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.