విశాఖ: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీట్లు కేటాయిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో బీసీలు నిర్ణక్ష్యానికి గురయ్యారని గుర్తు చేశారు. విశాఖకు పరిశుభ్రతలో అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు విశాఖపై నిర్లక్ష్యం వహించాయని ఆయన విమర్శించారు. సీఎం వైయస్ జగన్ విశాఖ శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్‌లు ‘క్లీన్‌సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆలిండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు 8వ ర్యాంకు లభించగా.. హైదరాబాద్ తొమ్మిది, ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే, ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు 2వ ర్యాంకు లభించింది. ఇక సీఎం వైయస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు ‘క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ’ అవార్డు లభించింది.