విశాఖ: రాష్ట్రంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ జీవీఎంసీ పరిధి 59 వ వార్డు నక్క వాని పాలెం లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి , విశాఖ వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి... ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే సీఎం వైయస్ జగన్ ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న ఆరోగ్య శిబిరంలో చికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని మరలా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రజా సంక్షేమ పథకం లో ఒకటైన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వీరు కోరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లభించినటువంటి... కాబోయే ఎమ్మెల్యే ఆడారి ఆనంద్ కుమార్ మీకు దొరకడం అదృష్టమని వైవి సుబ్బారెడ్డి కొనియాడారు.