మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ 

 గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు అంబటికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. 

 పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు
గతేడాది నవంబర్‌ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 

కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో  చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ వచ్చినప్పటికీ.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్‌లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్‌ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది.  కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. 

Back to Top