వైయ‌స్ఆర్‌సీపీ స‌ర్పంచ్‌పై హత్యాయత్నం

ఆరీఫ్ బాషాను పరామర్శిస్తున్న గోపిరెడ్డి

నరసరావుపేట  : పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం పెదతురకపాలెం గ్రామ సర్పంచ్, వైయ‌స్ఆర్‌సీపీ నేత షేక్ ఆరీఫ్ బాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు, ఎస్ఆర్ కేటీ కాలనీ నుంచి నరసరావుపేటలోకి ద్విచక్రవా హనంపై వస్తున్న బాషాను కారుతో ఢీకొట్టేం దుకు ప్రయత్నించారు. తప్పించుకున్న బాషా పక్కకు పడిపోయాడు. కారులోని వ్యక్తులు షేక్ చిరుమామిళ్ల సైదా, మహమ్మద్ హసన్ తోపాటు మరొకరు బాషాపై దాడికి పాల్పడ్డారు. స్థానికు లు కేకలు వేయడంతో పరారయ్యారు. దాడిలో గాయపడిన బాషాను ఏరియా వైద్యశాలకు తర లించి చికిత్స అందిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న విడాకుల వ్యవహరంలో బాషా సాక్షిగా ఉన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న చిరుమామిళ్ల సైదా కుటుంబసభ్యులు హత్యాయత్నానికి పాల్ప డ్డారని బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. బాషాను వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెం ట్ డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. 

Back to Top