తిరుమల లడ్డూపై చంద్రబాబు ‘గోబెల్స్’ ప్రచారం

సిట్ ఛార్జిషీట్‌తో బట్టబయలైన కూటమి కుట్రలు

అయినా సిగ్గు లేకుండా దుష్ప్రచారం

తప్పుడు ఆరోపణలపై స్వామివారికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి

చంద్రబాబు సహా కూటమి నేతలను డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు

తాడేపల్లి  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు. 

టీటీడీ తిరస్కరించినా దొడ్డి దారిలో తిరుమలకు కల్తీ నెయ్యి

అదే నెయ్యితో లడ్డూలు తయారీ

ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే

అదే విషయాన్ని ఛార్టిషీట్ లో పేర్కొన్న సీబీఐ సిట్

దాన్నుంచి డైవర్షన్ కోసమే బాబు మరో కుట్ర

నెయ్యిలో బాత్రూమ్ కెమికల్స్ అంటూదుష్ర్పచారం

ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లాది విష్టు

బోలేబాబాకు డోర్లు తెరిచిందే చంద్రబాబు

సిట్ నివేదికపైనా వక్రీకరణలు 

ఛార్జిషీట్ లో అంశాలను దాచిపెడుతూ తప్పుడు ప్రచారం

లోకేష్ చెప్పవన్నీ పచ్చి అబద్దాలు

మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మా పైనే నిందలా?

ఆధారాలతో సహా నిలదీసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు

తాడేపల్లి: గడిచిన 20 నెలలుగా పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఆయన సాక్ష్యాధారాలతో తిప్పికొట్టారు.  సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నివేదిక ప్రకారం కూటమి ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా అయిందని... వాటితోనే లడ్డూలు తయారు చేశారన్న మల్లాది విష్టు... కల్తీ జరగడానికి బాధ్యుడు చంద్రబాబేనని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రి లోకేష్ సైతం ఎన్ డీ డీ బీ నివేదిక పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలే బాబాకు నెయ్యి సరఫరాకు 2018లో చంద్రబాబే అనుమతి లిచ్చారని ఆధారాలతో సహా వివరించారు. వైయస్.జగన్ హయాంలో కేజీ నెయ్యి రూ.320 కే ఏ రకంగా సాధ్యమంటున్న చంద్రబాబు... 2016 నుంచి 2018 మధ్యలో రూ.320 నుంచి రూ.271 కే ఎలా సఫ్లై చేశారని నిలదీశారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రను తగ్గించేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వామివారి ముందు తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే..

కూటమి ఆరోపణలు- ఆధారాలతో   వైయ‌స్ఆర్‌సీపీ నిజాలు

కూటమి ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్ పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తోంది కాబట్టి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా  చంద్రబాబు పైనే ఉంది. 2024 జూన్ 12, 21,25 జూలై 4 న లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నాణ్యతపై పరీక్షలు జరగ్గా...అవన్నీ నాణ్యతా పరీక్షలో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 2న వచ్చిన రెండు ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన రెండు ట్యాంకర్ల నెయ్యిలో నాణ్యత, నిర్దేశించిన ప్రమాణాలు లేవన్న కారణంతో వెనక్కి పంపించారు. కానీ తిరస్కరించిన ట్యాంకర్లను జూలై 24 ఉదయం శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద, వైష్టవి డెయిరీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి మరలా తిరుమల తిరుపతి దేవస్థానానికి దొడ్డి దారిని పంపించారు. అంటే ఈ కేసుకు మూలం, కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. నాణ్యత లేదన్న కారణంతో నాలుగు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించి... మరలా దొడ్డి దారిని  అవే నెయ్యి ట్యాంకర్లను రప్పించి లడ్డూ తయారీలో వాడింది కూడా ఈ ప్రభుత్వమే. అలాంటప్పుడు సమాధానం చెప్పాల్సింది కూడా చంద్రబాబు కాదా? 

కల్తీ నెయ్యి వాడింది బాబు హాయంలోనే - స్పష్టం చేసిన సిట్ 

కల్తీ నెయ్యి కేసుకు మూలం కీలకమైన ఈ ప్రశ్నలకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు ఎప్పుడైనా సమాధానం చెప్పారా? 05-05-2025 నాడు సిట్ పొందుపరిచిన మొదటి ఛార్జిషీట్ ప్రకారం.. నాణ్యత లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 నెయ్యి ట్యాంకర్లని జూలై 25 2024 నా టీటీడీ  వెనక్కి పంపినట్టు స్పష్టం చేసింది. అదే విధంగా టీటీడీ తిరస్కరించిన 4 నెయ్యి ట్యాంకర్లు మరలా దొడ్డి దారిన టీటీడికి వచ్చాయని, ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని సిట్ తాజాగా 23-01-2026 దాఖలు చేసిన ఫైనల్ సంప్లమెంటరీ ఛార్జిషీట్ పేజీ నెంబరు 44 లో చెప్పింది. 

తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతుకొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె కలిసిందని పదే, పదే కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. ప్రసాదంలో ఎలాంటి జంతు, పంది కొవ్వులు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్ డీ డీ బీ, ఎన్ డీ ఆర్ ఐ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ ల్యాబ్ రిపోర్టులను సీబీఐ సిట్ తన చార్జిషీట్ లో పొందు పరిచింది. సెప్టెంబరు 18 2024 న ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ ల సాక్షిగా స్పష్టమైన ఇప్పటివరకూ కూడా చంద్రబాబు దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడికి, ప్రజలకు క్షమాపణ కోరలేదు.

సిట్ ఛార్జి షీట్ సాక్షిగా వాస్తవాలివే...

తిరుమల ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతుకొవ్వు, అవుకొవ్వు, పందికొవ్వు కలిసాయంటూ ఎన్ డీ డీ బీ రిపోర్టు ఇచ్చింది.. అదే  సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ లోని 35 వ పేజీలో ఉందంటూ మంత్రి లోకేష్ చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే... జూలై 2024లో ఎన్ డీ డీ బీ ఇచ్చిన రిపోర్టులో నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని ఎక్కడా నిర్ధారణ చేయలేదు. తాము తయారు చేసిన నివేదిక కొన్ని సందర్భాలలో తప్పు కావచ్చని.. ఆ డాక్యుమెంట్లను కోర్టులకు, ఇతర న్యాయపరమైన అంశాలకు వాడకూడదని ఎన్ డీ డీ బీ పేర్కొంది. దానికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని వై వీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు.. సుప్రీం కోర్టు  కూడా చంద్రబాబు తీరును తప్పుపట్టింది. నిర్ధారణ లేని అంశాల ఆధారంగా ఎలా మాట్లాడతారు? కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై మాట్లాడినప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని కోర్టు, చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. మరో ల్యాబ్ లో పరీక్షించి సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో సిట్ ఈ నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్ ను గుజరాత్ లో ఉన్న ఎన్ డీ డీ బీకి, హర్యానాలోని కర్నాల్ లో ఉన్న ఎన్ డీ ఆర్ ఐ కు పంపించింది. ఈ రెండు ల్యాబ్ లు కూడా ఈ నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు, పందికొవ్వు, గొడ్డుమాంసం, ఫిష్ ఆయిల్ లేవని చెప్పింది. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ పేజీ నెంబరు 35లో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లో ఎన్ డీ డీ బీ పాత రిపోర్టును ప్రస్తావించారు. తర్వాత పేజీల్లో నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు, పందికొవ్వు, ఫిష్ ఆయిల్ లేవని స్పష్టం చేశారు. దీన్ని దాచిపెట్టి లోకేష్ అసత్య ప్రచారాలు చేశారని స్పష్టమవుతోంది.
కేసు దర్యాప్తులో బాగంగా నెయ్యి శాంపిల్స్ ను రెండో సారి సిట్ ఎన్ డీ డీ బీకి  ఎన్ డీ ఆర్ ఐ కి పంపించి వచ్చిన నివేదికే ఛార్జిషీట్ లో పొందుపరుస్తూ ఎలాంటి జంతుకొవ్వులు లేవని తేల్చింది. మరి ఛార్జిషీట్ లో వాస్తవాలు ఒకలా ఉంటే రోజూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, వైయస్.జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 

టెండరు నిబంధనల్లోనూ కూటమి అక్రమాలు..

కూటమి మరో కుట్ర ప్రశ్న చూస్తే... 2019 ఏడాది ప్రారంభంలో మా ప్రభుత్వంలో నెయ్యి టెండరు నిబంధనలను కఠినతరం చేశాం, సడలించడం వల్లే నెయ్యి కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్న నేపధ్యంలో.. బయటపడ్డ వాస్తవం ఏమిటంటే...  2019 జనవరి కంటే ముందు అంటే 2014-2019 వరకు నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సులభంగా ఉన్నాయని వారు అంగీకరించినట్టే. ఐదేళ్ల పాటు సులభంగా టెండర్లు రూపొందించి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇదే ప్రెస్ మీట్ లో అప్పటి టీడీపీ హయాంలో తీసుకొచ్చిన టెండరు నిబంధనలు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదని పాత్రికేయులు ప్రశ్నిస్తే... ఎన్నికల వచ్చిన నేపధ్యంలో అమలు చేయలేదని చెబుతున్నారు. అంటే ఐదేళ్లపాటు నిబంధనలను అమలు చేయకుండా ఎన్నికల ముందు తూతూ మంత్రంగా రూపొందినట్లు అర్ధం అవుతోంది.

మరోవైపు  వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో నిబంధనలను సడలించడం మహాపాపంగా చంద్రబాబు ఆయన పార్టీకి చెందినవారు చెబుతుండగా. .వాస్తవం ఏమిటంటే నెయ్యి సరఫరా చేయాల్సిన కంపెనీలు పాటించాల్సిన ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల నిబంధనలను టెండర్లలో పొందుపరిచాం. నెయ్యి సరఫరాకు టెండరు దక్కించుకున్న ఏ కంపెనీ అయినా టీటీడీకి ట్యాంకరు పంపించడానికి ముందుగా ఎఫ్ ఎస్ ఎస్ ఓ ఐ అక్రిడేటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని రావాలి. కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతోంది. మరి టెండర్ల సడలింపు అంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న కూటిమి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బోలేబాబాకు గేట్లు ఎత్తిందే చంద్రబాబు..

 బోలేబాబా ద్వారా కథ నడిపి తిరుమలకు వచ్చే నెయ్యిని కల్తీ చేశారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు.. వాస్తవమేమిటంటే బోలేబాబా కంపెనీకి పూర్వ నామం హర్ష ప్రెష్ డెయిరీ కాదా ఈ కంపెనీకి 2019 మార్చి 6 నెయ్యి సరఫరాకు టెక్నికల్ క్వాలిఫై చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. 2019 ప్రారంభంలో నెయ్యి టెండర్లలో కఠిన నిబంధనలు తీసుకొచ్చామని చెబుతున్నా టీడీపీ అదే ఏడాది మొదట్లో వైయస్సారీపీ ప్రభుత్వం రాకముందే చంద్రబాబు ప్రభుత్వం బోలేబాబాకి డోర్లు తెరిచింది. తద్వారా 82వేల కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సరఫరా చేయడానికి కేజీ నెయ్యి ధర రూ.291కే బోలేబాబాకి టీడీపీ హాయంలో అనుమతిచ్చింది.  
2019 ఏఫ్రిల్ 19న మరోక్కసారి 12,300 కేజీల నెయ్యి సఫ్లై ఆర్డర్ కూడా ఇచ్చారు. దీనికి కూటమి నేతలు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? బోలేబాగా కంపెనీకి ఒక్క ఆవు కూడా లేదు, ఒక్క కేజీ నెయ్యి కూడా సరఫరా చేసే సామర్ధ్యం లేదని ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలు... 2019లో టెండరు ఇచ్చారంటే.. టీడీపీ హయాంలోనే తప్పు జరిగినట్లు తెలుస్తోంది. 
రాష్ట్ర ప్రజలకు తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెబుతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం తప్పు దారి పట్టించే పని చేస్తోంది. 

రూ.320 కేజీ సాధ్యమా అంటూ రూ.273కే ఎలా ఇచ్చారు?

మరోవైపు సీబీఐ సిట్ ఛార్జిషీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ ఆగ్రీ పుడ్స్ రూ.320లకే కేజీ నెయ్యిని 2019 నుంచి సరఫరా చేస్తుందని స్పష్టం చేసింది. మరి ఇవాళ రూ.320కే కేజీ నెయ్యి దొరుకుతుందా అంటూ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చేలా పదే పదే మాట్లాడుతూ... ప్రజలకు అపోహ కలిగించిన చంద్రబాబు.. 2016 నుంచి 2018 వరకూ రూ.321, రూ.364, రూ.273లకే ఏ విధంగా కేజీ నెయ్యి సరఫరాకి టెండర్లు అప్పగించారు. వాళ్లే బోలేబాబాకు అనుమతిలిచ్చారు. వాళ్ల హయాంలోనే నెయ్యి నాణ్యతలో విఫలమైన వెనక్కి పంపిన 4 నెయ్యి ట్యాంకర్లను దొంగదారిలో మరలా  తెప్పించి.. లడ్డూ ప్రసాదంలో వాడారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన చంద్రబాబుకి తిరుమల స్వామి వారి ప్రాశస్త్యాన్ని తగ్గిస్తున్నామని అనిపించకపోవడం చాలా బాధాకరం. స్వామి వారి ప్రసాదాన్ని కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందీ కూడా చంద్రబాబు ప్రభుత్వమే. 

బాబు పాలనలో ఆలయ భూములు అన్యాక్రాంతం..
 
దేవాలయాలకు ధూపధీపనైవేద్యాలకు, కైంకర్యాలకు లోటు రాకుండా ఉండాలని దాతలు భూములిస్తే వాటిని కూడా తమ వారికి ధారాదత్తం చేస్తున్నారు. టెక్కలిలో కేబినెట్ తో సంబంధం లేకుండానే ఆర్డీవో ఆటస్థలం కోసం ఆలయభూములు కేటాయించారు. కాకినాడలోనూ, విజయవాడ నడిబొడ్డున దుర్గామళ్లేశ్వరస్వామి భూములను వారి అనుయాయులకు పంచే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని  వైయ‌స్ఆర్‌సీపీతీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు తప్పైందని ఒప్పుకోవాలని మల్లాది విష్టు డిమాండ్ చేశారు.  

Back to Top