కాసేప‌ట్లో రాజ్య‌స‌భ స‌భ్యుల ప్ర‌మాణ‌స్వీకారం

ఢిల్లీ: కాసేప‌ట్లో రాజ్య‌స‌భ‌లో నూత‌న స‌భ్యుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ప్రారంభం కానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు పిల్లి  సుభాష్ చంద్ర‌బోస్‌, ఆళ్ల‌ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ నేడు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు పరిమళ్‌ నత్వానీ అస్వ‌స్థ‌త కార‌ణంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌పోతున్న‌ట్లుగా తెలిసింది. కాగా, వ‌చ్చే పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. రాజ్య‌స‌భ‌లో మొద‌ట‌గా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అనంత‌రం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.  రాజ్య‌స‌భ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం ఆరుకు చేరింది.

Back to Top