ఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదే

వైయ‌స్ఆర్‌సీపీ  గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి  

తాడేప‌ల్లి:  చంద్రబాబు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను చదువుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి  సూచించారు.  ఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

- చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా,రాజ్యాంగం అన్నా,ఎన్నికల కమీషన్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు.

- ఆ వ్యవస్ధలను లెక్కచేయకుండా చంద్రబాబు సొంత రాజ్యాంగం అమలుచేస్తున్నాడు.

- చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వైయస్సార్ సిపి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడం ఎన్నికల కమీషన్ కూడా దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన వివరణ కోరినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు.

- 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ,40  ఏళ్ల  రాజకీయఅనుభవం ఉన్న చంద్రబాబుకు మోడల్  కోడ్  ఆఫ్  కండక్ట్  తెలియదా.

- ఎం  సి సి  నిబంధనలు  ఒక్క సారి  చదవండి  చంద్రబాబు.. లేకపోతే  లక్ష  పుస్తకాలు  చదివిన మీ దత్తపుత్రుడు పవన్  కళ్యాణ్  ను  అడగండి.......

- ఎం సి సి  నియమాలకు  విరుద్ధంగా భువనేశ్వరి  పర్యటనలు  చేసి  చెక్కులు  పంచుతున్నారని  కూడా  ఈసీ కి   చెప్పాము.ఈసి సంబంధిత కలెక్టర్ ద్వారా నోటీసులు పంపింది.

- భువనేశ్వరి ఆ విధంగా చేయడం ఓట్లు కొనడమే అవుతుంది.

- టిడిపి ఎన్ ఆర్ ఐ యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం సైతం ఓట్ల కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు.గ్రామాలలో బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ,పేదలను మభ్యపుచ్చే ప్రయత్నాలు,ప్రలోభపరిచే కుట్రలు చేస్తున్నారు.

- చంద్రబాబుకు వార్దక్యం వల్ల నాలెడ్జ్ లేకపోతే స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటిలో స్విమ్మింగ్ ఫూల్స్ లో జలకాలాడుతూ చదివిన లోకేష్ ను అడిగి ఎన్నికల నియమావళి తెలుసుకోవచ్చు.

- చంద్రబాబు ఇప్పటికైనా ఎన్నికల నియమావళిని తెలుసుకుంటే బాగుంటుంది.

- దొంగతనం చేసిన దొంగ...దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా చంద్రబాబు ఎంసిసిని ఉల్లంఘిస్తూ తన పచ్చమీడియా,పచ్చపత్రికలలో మాత్రం జగన్ గారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.

- ప్రజలు ఆల్ రెడీ జగన్ గారిని గెలిపించేందుకు డిసైడ్ అయిన విషయాన్ని చంద్రబాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.

Back to Top