వైయ‌స్ జగన్ సంక్షేమ పధకాలపై  టీడీపీ  దుష్ప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు నారాయణమూర్తి  

తాడేప‌ల్లి: జనం మెచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పధకాలపై  టీడీపీ  దుష్ప్రచారం  చేయిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు నారాయణమూర్తి  మండిప‌డ్డారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

- ప్రతిరోజూ పచ్చపత్రికలు,మీడియాలో అసత్యాలు,అబద్దాలతో వార్తలు రాయించడం వాటిని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం 

- చంద్రబాబుహయాంలో వేలాది  స్కూళ్ళు  మూతపడ్డాయి. కావాలంటే  డేటా  చూసుకోవచ్చు

- ఇవాళ ఏపీ  లో  విద్యా వ్యవస్థ  బలంగా ఉంది.

- చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని  జీఓ  ఇచ్చారు 

-  గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభు­త్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 

- అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపో­తున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. 

- ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్‌ స్టాండర్డ్స్‌తో ఉంటున్నారని, సిలబస్‌ను సైతం అర్థం చేసుకో­లేకపోతున్నారని, బేసిక్స్‌ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు జగన్ గారు విద్యవ్యవస్దపై ప్రత్యేక దృష్టిసారించారు.

- 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు.

- అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌తో డిజిటల్‌ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్‌లో రాణించేందుకు టోఫెల్‌ శిక్షణను ప్రవేశపెట్టారు. 

- బైలింగ్వుల్‌ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్‌ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్‌ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్‌ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు.
 
- 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 

- 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాశారు. 

- 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియ­ట్‌లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకు­న్నారు. 2025 జూన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బాకలా­రియెట్‌ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు.

- విద్యావ్యవస్దలో సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఏపివిద్యార్దులను ప్రపంచస్దాయిలో పోటీ పడేవిధంగా జగన్ గారు తీర్చిదిద్దేందుకు పనిచేస్తుంటే పచ్చమీడియా విషప్రచారం చేస్తోంది.

- సంస్కరణల ఫలితాలను అందుకుంటున్న విద్యార్దులు,వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.

- పల్లెల్లో ఇంగ్లీషు మీడియం అభ్యసిస్తున్న బడుగు,బలహీనవర్గాల పిల్లల విద్య,విషయపరిజ్ఞానం పెరిగింది.

-పచ్చమీడియా,చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారి రాష్ర్టంలోని ప్రభుత్వ స్కూల్స్ ను సందర్సించాలి.

-ఇలా వైయస్సార్ సిపి ప్రభుత్వంపై అవాకులు,చెవాకులు రాస్తే నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు.

Back to Top