విజయవాడ: అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడ నగరంలో శుక్రవారం దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవినేని అవినాష్ ఏమన్నారంటే.. 18వ డివిజన్‌లో డ్రైనేజీ, రోడ్లు పనులను నిర్లక్ష్యం చేసిన టీడీపీ ప్రభుత్వం టీడీపీ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాన్ని 18కోట్లతో మౌలిక సదుపాయాల కల్పించాం డివిజన్ లో కమ్యూనిటీ హాల్, నిర్మాణం సైతం పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది నాడు నేడు ద్వారా స్థానిక ఎలిమెంటరీ స్కూల్‌ను హై స్కూల్‌గా మార్చము అర్హత ప్రామాణికంగా ప్రతీ ఒక్కరికి పథకాలు అందించాం ఈ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు టీడీపీ నేతలకి లేదు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రచారం చేసే ప్రతీ రోడ్డు జగన్ ప్రభుత్వమే నిర్మించింది టీడీపీ నేతలకు అనుభవం కాదు ఆచరణ, అభివృద్ధి ఎక్కడ ? టీడీపీ నేతల అవమానం సహించలేక జనసైనికులు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని గద్దె ప్రజలకు క్షమాపణ చెప్పాలి అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట రీటైనింగ్ వాల్ నిర్మాణంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా?. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు టీడీపీ నేతల కాల్ మనీ వేధింపులు భరించలేక మహిళ పోలీసులను ఆశ్రయించింది నిజం కాదా మాకు వద్దు ఈ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ప్రజలు అంటున్నారు