తాడేపల్లి: చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నారని ఆమె చెప్పారు. బుధవారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. - మహిళలను మోసం చేసే మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారు.రాష్ర్టంలో ఏ మహిళా కూడా చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదు. - చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన మోసం వల్ల డ్వాక్రా మహిళలు రోడ్డున పడ్డారు. - మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు. - వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక మహిళలకి స్వర్ణ యుగం ప్రారంభమైంది. - ఆసరా,చేయూత వంటి పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు.చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా,మోసాలతో ఉంటుందో మహిళలకి తెలుసు. - చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ భారం ఉండేది ఇప్పుడు వడ్డీ రాయితీతో డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారు. - చంద్రబాబు నంగనాచిలాగా మహిళలు ఎదుట మద్యం గురించి మాట్లాడుతున్నారు.బెల్ట్ షాపులు పెట్టింది నువ్వు కాదా.మద్యాన్ని ఊరూరా పారించింది నీవు కాదా. - కేంద్రం వల్ల పెట్రోల్,నిత్యావసర వస్తువులు,సరుకుల రేట్లు పెరుగుతున్నాయి.ఇది బహిరంగ రహస్యం.అయినా బిజేపితో పొత్తుతో ఉన్నారు కాబట్టి బిజేపిని నిలదీసే దమ్ములేక జగన్ గారిపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. బీజేపీని ఎందుకు అడగం లేదు.. - రాజకీయపదవులలోనే కాదు,ప్రభుత్వ వర్క్స్ లలో సైతం 50%మహిళలకి రిజర్వేషన్ అమలు చేసాము. చంద్రబాబూ మీకు దమ్ముంటే అమలు చేయగలరా. - చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు..సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నారు. - రాష్టంలో గంజాయి ఉందని అబద్దాలు చంద్రబాబు చెబుతున్నాడు. - విశాఖలో పట్టుబడిన 25వేల టన్నుల డ్రగ్స్ రవాణా వెనకాల ఎవరు ఉన్నారో అందరికి తెలుసు. - గంజాయి సాగు మేము నాశనం చేశాం.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. - మీ హయాంలో గంజాయి లేదా...మహిళలు మిస్సింగ్ గురించి సైతం అబద్దాలు చెబుతున్నారు.మహిళలకు భధ్రత కల్పించింది జగన్ - చంద్రబాబు వంద అబద్దాలు చెబితే అందులో ఒకటేనా నిజం ఉండాలి కదా.