బాపట్ల: పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఒక అరాచక శక్తిగా మారాడని వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధూళ్లిపాళ్ల నరేంద్ర దోపిడీ, అరాచకాలు తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి లోనే వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..` అక్రమ మార్గంలో రైతులకు సంబంధించిన సంగం డెయిరి ని ధూళ్ళిపాళ్ల నరేంద్ర కొట్టేశాడు. సంగం డెయిరీ మీ నాన్నను నిర్మించాడా, మీ తాత నిర్మించాడా? ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గంలో గ్రావెల్ అమ్మేశారు. మన్నవ గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతుంటే దాన్ని ప్రశ్నించినందుకు నాగమల్లేశ్వరరావు పైన ధూళ్ళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది నిజం కాబట్టే తెలుగుదేశం నాయకులు ఎవరు మీ తరఫున మాట్లాడలేదు. చివరికి గుడికి సంబంధించిన ల్యాండ్ కూడా లీజు పేరుతో కొట్టేశాడు. ధూళ్ళిపాళ్ల నరేంద్ర దోపిడీపై పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు` అని అంబటి మురళి పేర్కొన్నారు.