వినాశకాలే విపరీతబుద్ధి 

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ఎల్లోమీడియా దుష్ర్ప‌చారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఖండించారు. డ్రామోజీ! మొన్న వలంటీర్లను అవమానించావు. ఇప్పుడు డ్వాక్రా మహిళలను హేళన చేస్తున్నావు. నువ్వు కార్టూన్లు వేసినట్లు వారేమీ బిచ్చగాళ్ళు కాదు. తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాలను పోషిస్తున్న మేరునగధీరులు డ్రామోజీ. కండకావరం ఎక్కువైనట్లుంది. వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు పెద్దలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఎల్లో కుల మీడియా ఆర్తనాదాలు 
 హెరిటేజికి పా(పూ)ల దారి పరుస్తూ చంద్రం అన్నయ్య ప్రభుత్వ డెయిరీలను మూయించాడు. మూతబడ్డ చిత్తూరు డెయిరీ అతిపెద్ద రైతుల కోపరేటివ్ డెయిరీ. దానిని ‘అమూల్’కి లీజుకి ఇచ్చి తెరిపిస్తే ఎల్లో కుల మీడియా ఆర్తనాదాలు చేస్తోంది. బాబు వ్యాపారాలకు కాపలా కుక్కలా మారింది ఈ ఎల్లోమీడియా! అంటూ మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top