మహానేత పాలన స్వర్ణయుగం

రైతు గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌

మహానేత తరహా పాలన జగనన్న అందిస్తారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

 

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఒక స్వర్ణయుగమని, ఆయన మరణించిన పదేళ్ల తరువాత వైయస్‌ఆర్‌ జిల్లాకు, ఆంధ్రరాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. మహానేత జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని రైతు దినోత్సవ రాష్ట్ర స్థాయిలో కార్యక్రమానికి హాజరైన వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. రైతుల పట్ల శ్రద్ధ చూపిన ఏకైక ముఖ్యమంత్రి మహానేత వైయస్‌ఆర్‌. రైతుల సమస్యలు అర్థం చేసుకొని ఉచిత విద్యుత్‌ ప్రకటించారు. మహానేత పాలనలో రైతులు ఏ కారణం చేత అయినా పంట నష్టపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌లు వచ్చేవి. అదే విధంగా సాగునీటి విషయంలో జలయజ్ఞం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు చేపట్టి ముందుకువెళ్లారు.
 
మైలవరం డ్యామ్‌ తుంగభద్ర స్కీమ్‌లో చివరి ప్రాజెక్టు. చిత్రావతి తరువాత మైలవరం ప్రాజెక్టు.. ఈ రెండు డ్యామ్‌లకు ఏ సంవత్సరం నీరు వచ్చేవి కావు. తుంగభద్రను నమ్ముకుంటే అన్యాయం జరుగుతుందని గ్రహించి కృష్ణానీటిని గండికోటకు తీసుకువచ్చిన భగీరథుడు వైయస్‌ఆర్‌. వైయస్‌ఆర్‌ మరణించిన పదేళ్ల తరువాత మన జిల్లాకు, మన రాష్ట్రానికి మంచి కాలం వచ్చింది. మహానేత తరహా పాలన జగనన్న అందిస్తారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ శరవేగంగా ముందుకువెళ్తాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే ఆలోచనతో జగనన్న ముందుకు వెళ్తున్నారు. 

రాష్ట్ర బడ్జెట్‌ను గత చంద్రబాబు ప్రభుత్వం సర్వనాశనం చేశారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఈ పరిస్థితి ఒకవైపు బాగు చేసుకుంటూనే.. నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కోరారు. జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలని, అరటి రైతుల సమస్యలు పరిష్కరించాలని, ప్రతి రైతుకు న్యాయం చేసేవిధంగా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

తాజా వీడియోలు

Back to Top