భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయం

 ‘ఐక్యరాజ్య సమితి’లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Image

Back to Top